ఒంగోలులో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. మనసును కలచివేసిందన్న చంద్రబాబు నాయుడు

Image-Twitter

ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

 • Share this:
  ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విద్యార్థిని తేజస్విని కళాశాల ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నదన్న వార్త మనసును కలచివేసిందిన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయమని చెప్పారు. తల్లిదండ్రులకు చదివించే స్తొమత లేదన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజు రీఇంబర్స్ మెంటు ఏమైంది? అంటూ ప్రశ్నించారు. నాడు నేడు అంటూ పనికిమాలిన కబుర్లు చెబుతూ విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత నిరాశావాదంతో ప్రాణాలు తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలన్నిటినీ పరిష్కరించాలని కోరారు. అలాగే తేజస్విని కుటుంబానికి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  ఇక, ఒంగోలు గొడుగు పాలెంకు చెందిన పాపిశెట్టి తేజస్విని క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతుంది. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్విస్ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజుల కోసం వేధించటం వల్లే తేజస్విని ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రుల ఆరోపణలు చేస్తున్నారు. ఆమె తండ్రి నాగేశ్వరరావు ముఠా కూలీగా పనిచేస్తున్నాడు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ సౌకర్యం ఆగిపోవడం.. శుక్రవారం రూ.35వేలు ఫీజు చెల్లించిన తండ్రి ఇకపై తాను డబ్బులు చెల్లించలేనని చెప్పడంతో మనస్తాపానికి గురైన తేజస్విని ఆత్మహత్యకు పాల్పిండిందని వార్తలు వెలువడుతున్నాయి.

  ఇక, ఈ ఘటనపై ఒంగోలు వన్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: