హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీట్లపైనా పార్టీలకు క్లారిటీ

AP Politics: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీట్లపైనా పార్టీలకు క్లారిటీ

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్,చంద్రబాబు (ఫైల్ ఫోటో)

AP Politics: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోసారి పొత్తులపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలోనూ ఆయన ఇదే విషయం చెప్పారు కూడా.. కానీ మరో అడుగు ముందుకు వేసి.. సీట్లపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...

AP Politics:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ (Election Heat) కనిపిస్తోంది. అన్ని పార్టీలు 2024 లో గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam) .. ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది.. అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన చేపట్టారు. ఓ వైపు ప్రభుత్వం వ్యతిరేక విధనాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో.. ఆయా జిల్లాల్లో నిస్తేజంగా ఉన్న కేడర్ లో జోష్ నింపుతున్నారు. అధినేతన రాకతో ఆయా జిల్లాల్లో పార్టీ లెక్కలు మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్నటి వరకు పార్టీలో నాయకులు ఉన్నా.. వారంతా ఇన్ యాక్టివ్ గా ఉండేవారు.. అలాంటి నేతలను స్వయంగా కలిసిన చంద్రబాబు.. క్లాస్ పీకడంతో.. అంతా మళ్లీ జనం బాట పడుతున్నారు. పూర్తి యాక్టివ్ అవుతున్నారు. అలాగే కొన్నిచోట్ల సీట్లపైనా ఆయన స్పష్టమైన హామీ ఇస్తున్నారని టాక్.. దీంతో ఆయా నియోజకవర్గాల్లో వారంతా ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా మరోసారి పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు..

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై అంతా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు. మనకు ఎందుకులే అని వదిలిస్తే.. అరాచక పాలన కారణంగా రాష్ట్రం రావణకాష్టం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి సమయంలో ప్రజల కోసం అంతా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం పొత్తుపై వ్యాఖ్యలు చేయడమే కాదు.. అలా అన్ని పార్టీలు ముందుకు వస్తే.. అరాచక ప్రభుత్వానికి కిందకు దించడానికి తెలుగు దేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది అన్నారు. అలాగే అవసరమైతే టీడీపీ (TDP) త్యాగాలు కూడా సిద్ధం అన్నారు.

ఇదీ చదవండి : అదితికి అధినేత లైన్ క్లియర్.. పూర్తి యాక్టివ్ అయిన వారసురాలు

ఆయన మాటల బట్టి చూస్తే.. తమతో పొత్తుపెటుకునే పార్టీ డిమాండ్లకు ఓకే అనే సంకేతాలు ఇచ్చారు. అంటే ఆయా పార్టీలు అడిగిన సీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని సంకేతాలు ఇచ్చారు. అంటే జనసేన (Janasena) డిమాండ్లు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నామనే క్లారిటీ ఇచ్చినట్టే అయ్యింది. అలాగే బీజేపీ (BJP)నీ కూడా దగ్గర చేసుకునే వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరిపైనా వ్యతిగత కోపం లేదు అన్నారు. కేవలం రాష్ట్ర ప్రజలు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాల్సి వస్తుందని.. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు.

ఇదీ చదవండి: అలల సవ్వడిని ఆస్వాదిస్తూ.. ఆహా ఏమి రుచి అని లొట్టలేయాలని ఉందా? అది కూడా రూఫ్ టాప్ పై? ఎక్కడో తెలుసా?

అంటే గతంలో బీజేపీని ఎందుకు తిట్టాల్సి వచ్చిందో అన్నదానిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అయితే చంద్రబాబు ఏ వ్యాఖ్యలు చేశారో.. గతంలో జనసేన పార్టీ ఆవిర్బావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఓడిపోకూడదంటే.. పొత్తులు అవసరం అన్నారు. ఇలా రెండు పార్టీల అధినేతలు మాటలు చూసినా.. రెండు పార్టీల నాయకులు, కేడర్ అభిమతం చూసినా.. కచ్చితంగా ఈ రెండు పార్టీల పొత్తు ఉంటుంది అన్నది క్లారిటీ వచ్చినట్టే.. మరి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Janasena, Pawan kalyan, TDP

ఉత్తమ కథలు