Home /News /andhra-pradesh /

TDP CHIEF CHANDRABABU NAIDU IN BOJJALA GOPALAKRISHNA REDDY CREMATION NGS

BABU IN BOJJALA CREMATION: చిరకాల మిత్రుడికి ఆత్మీయ వీడ్కోలు.. బొజ్జల పాడె మోసిన చంద్రబాబు

పాడె మోసిన చంద్రబాబు

పాడె మోసిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ(telugu desam party) సీనియర్ నేత, మాజీమంత్రి బొజ్జల( bojjala Gopala reddy) గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియల్లో(funerals) ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandra babu ) పాల్గొన్నారు. తన చిరకాల మిత్రుడి భౌతికకాయానికి నివాళులర్పించి....కొంత దూరం పాడెమోశారు.

ఇంకా చదవండి ...
    Chandrababu in Bojjala Cremation:  మాజీ మంత్రి తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) లో కీలక భూమిక పోషించిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjala Gopalakrishna Reddy) అంత్యక్రియలకు ఆ పార్టీ నేతలంతా తరలివచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  (Chandrababu Naidu) బొజ్జల పార్థీవదేహానికి నివాళులర్పించి... అంతిమ యాత్రంలో పాల్గొన్నారు. కొంత దూరం పాడె మోసి తన ఆత్మీయ మిత్రుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు చంద్రబాబు హైదరాబాద్ (Hyderabad) నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గాన ఊరూందురూకు బయలుదేరి వెళ్లారు.

    మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (Bojjala Gopala Krishna Reddy) శనివారం కన్నుముశారు.  అనారోగ్యంతో ఉన్న ఆయన కొంత కాలంగా మంచానికే పరిమితం అయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో వారం క్రితం అపోలో ఆస్పత్రిలో (Appllo Hospital) చేర్పించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.

    బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు మిత్రుడు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు జరిపిన దాడిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గాయపడ్డారు. ఆ గాయాలకు ఆయన చాలా కాలం పాటు చికిత్స తీసుకున్నారు. పలు ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. గత నెలలో బొజ్జల పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు ఇతర సన్నిహితులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించారు.

    ఇదీ చదవండి : సర్వ రోగాలను దూరం చేసే పండు.. అంతేకాదు రైతులకు కాసుల వర్షమే.. ఎలా సాగు చేయాలంటే?

    అలిపిరి దాడిలో తీవ్రగాయాలు అయినా రాజకీయంగా ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు.. బొజ్జల 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత శ్రీకాళహస్తి (Sri Kalahasti) ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి మంత్రి వర్గంలో ఆయన ఆటవి శాఖ మంత్రిగా పని చేశారు. అయితే, అనారోగ్యం కారణంగా చివరిలో ఆయనకు విశ్రాంతినిచ్చారు చంద్రబాబు. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి బొజ్జలకు బదులుగా ఆయన తనయుడు సుధీర్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

    ఇదీ చదవండి : పెళ్లికోసం అమ్మాయిగా మారిన “అతడు”.. చివరికి ఊహించని ట్విస్ట్

    అటు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశంలో ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆత్మీయ మిత్రులుగా ఉండేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాలలో కేసీఆర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి. బొజ్జల అనారోగ్యంతో ఉన్నారని తెలిసిన తర్వాత కేసీఆర్ కూడా హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా బొజ్జల మరణంపై వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పందించారు.. ఆత్మీయ మిత్రుడ్ని కోల్పోవడం బాధకరమన్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు