TDP CHIEF CHANDRABABU NAIDU FIX TICKETS FOR SOME FAMILIES FOR NEXT ELECTIONS THESE ARE THE DETAILS NGS
TDP: టీడీపీలో ఫ్యామిలీ ప్యాక్.. ఆ కుటుంబాలకు టికెట్లు ఫిక్స్ చేసిన చంద్రబాబు.. ఎవరు ఎక్కడ నుంచి అంటే?
చంద్రబాబు (ఫైల్)
TDP Family Berths: తెలుగు దేశం పార్టీకి వారంతా కీలక నేతలు.. వారి లేని పార్టీని ఊహించుకోలేం.. కష్టం కాలంలోనే వారు.. అధికార పార్టీ నుంచి వేధింపులు.. కేసులను తట్టుకుని.. టీడీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో అలాంటి వారికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.. వచ్చే ఎన్నికల నాటికి ఫ్యామిలికీ రెండుకి తగ్గకుండా టికెట్లు కన్ఫాం చేసినట్టు టాక్.
TDP Family Berths: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ప్రధాన ప్రతిపక్షం అప్పుడే ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ సారి ఎన్నికల్లో నెగ్గకపోతే.. కష్టాలు తప్పవని చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జాగ్రత్త పడుతున్నారు.. ముందస్తుగానే అన్ని చర్యలు చేపట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు ముందుకెళుతున్న విషయం తెలిసిందే.. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కోణంలో బాబు పనిచేస్తున్నారు. టీడీపీ శ్రేణులని సైతం సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు పార్టీ కోసం పని చేయని వారికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అదే సమయంలో పార్టీ కోసం కష్ట పడ్డవారిని అండగ నిలవాలని నిర్ణయించారు. ముఖ్యంగా వైసీపీ (YCP) ప్రభుత్వం వచ్చిన తరువాత చాలామంది టీడీపికి నిద్ర లేని రాత్రులే మిగిలాయి.. వరుస కేసులు వెంటాడాయి. చాలామంది కీలక నేతలపై కేసులు నమోదువుతున్నాయి.. బెయిల్ తెప్పించుకోవడానికి ఆ నేతల సమయం అంతే సరిపోతోంది. అంతేకాదు చాలామంది ఆస్తులు, వంశపరాంపర్యంగా వస్తున్న పదవులు కూడా కోల్పోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో.. అలాంటి వారికి చంద్రబాబు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి కోసం ఫ్యామిలీ ప్యాక్ ప్రటించినట్టు సమాచారం..
ఇప్పటికే చంద్రబాబు పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు.. ఇదే క్రమంలో పలు ఫ్యామిలీలకు సైతం బాబు సీట్లు ఫిక్స్ చేసినట్టు టాక్. అందులో ముఖ్యంగా పరిటాల ఫ్యామిలీకి రెండు సీట్లు ఇచ్చిన విషయం తెలిసిందే.. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పోటీ చేయనున్నారు. అలాగే జేసీ ఫ్యామిలీకు కూడా రెండు సీట్లు ఫిక్స్ అయ్యాయి. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం పార్లమెంట్లో జేసీ పవన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం ఉంది.
కోట్ల ఫ్యామిలీ నుంచి.. ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలు పార్లమెంట్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు. అటు భూమా ఫ్యామిలీ నుంచి.. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి పోటీకి దిగుతారు. ఇక కింజరాపు ఫ్యామిలీ నుంచి టెక్కలిలో అచ్చెన్నాయుడు..శ్రీకాకుళం పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తారు. రాజమండ్రి సిటీలో రామ్మోహన్ బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీకి దిగనున్నారని తెలుస్తోంది.
పూసపాటి ఫ్యామిలీ నుంచి.. విజయనగరం అసెంబ్లీలో అతిథి గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్లో అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారు. అలాగే అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీలు రెండు సీట్లు ఆశిస్తున్నారు. అయ్యన్నకు ఎలాగో నర్సీపట్నం సీటు ఉంది..ఇక తన కుమారుడు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు కావాలని అడుగుతున్నారు. ఇటు నెహ్రూకు జగ్గంపేట సీటు ఉంది..అయితే తన కుమారుడు నవీన్‌కు కాకినాడ ఎంపీ సీటు అడుగుతున్నారు. మరి వీరికి కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.