TDP CHIEF CHANDRABABU NAIDU FIRE ON AP GOVERNMENT DECISIONS HE DEMAND EXTENDED TO HOLIDAYS FOR SCHOOLS NGS
AP Schools Holidays: విద్యార్థుల క్షేమం కోసం స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలి.. చంద్రబాబు డిమాండ్
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
AP Schools Holidays: ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు మళ్లీ సెలవులు ఇస్తారా..? సంక్రాంతి సెలవులు ఇస్తారా..? ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గేదే లే అంటోంది.. సెలవులను పొడిగించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.. కానీ విపక్షాలు మాత్రం సెలవులు పెంచాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి.
Chandrababu Naidu On Schools: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని స్కూల్ విద్యార్థుల విషయంలో వెనక్కు తగ్గేదే లే అంటోంది ఏపీ ప్రభుత్వం(AP Government).. ఇప్పటికైతే స్కూళ్లకు సెలవు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడుతున్నా యి ముఖ్యంగా టీడీపీ (TDP) మాత్రం స్కూళ్లకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫైర్ అయ్యారు. కరోనా (Corona) మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులు పొడిగించాలన్నారు చంద్రబాబు. ఇప్పటికే కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారని గుర్తుచేశారు. రోజురోజుకి పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఓ నియంతలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ (YCP) పాలనలో టీడీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, నరసరావుపేటలో టీడీపీ ఇంచార్జి అరవింద బాబుపై దాడిని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని మండి పడ్డారు.
రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని.. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. తెలుగు దేశం పాలనలో పారిశ్రామిక వృద్ధిలో ఏపీ మొదటి స్థానంలో ఉంటే.. వైసీపీ హయాంలో క్యాసినో, క్లబ్ కల్చర్ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.
ఇటు స్కూళ్లు తెరవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం మండిపడ్డారు. ఇది చాలా ప్రమాదరమైన చర్య అన్నారు. జనవరి 20వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt
విపక్షాల డిమాండ్ ఏదైనా.. స్కూల్స్ తెరవడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కరోనా వ్యాప్తికి, స్కూళ్లు తెరవటానికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. విద్యార్థులు నష్టపోకూడదనే స్కూళ్లు తెరిచామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితి వస్తేనే స్కూళ్ల బంద్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.