110-140 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తాజా విశ్లేషణ...

AP Assembly Election 2019 : 50% వీవీప్యాట్ రసీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు... ఈవీఎంలపై ప్రజల్లో విశ్వసనీయత పోయిందన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 12:47 PM IST
110-140 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తాజా విశ్లేషణ...
చంద్రబాబు (File)
Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 12:47 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపును అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ బూత్ కన్వీనర్లు, సేవామిత్ర సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైసీపీ అరాచకాలనూ, బీజేపీ తప్పులనూ ప్రజల్లో ఎండగట్టామన్న చంద్రబాబు... ఒక్క కలం పోటుతో తెలంగాణలో 25 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 లక్షల ఓట్లు తొలగించాలని కుట్రలు చేశారన్న ఆయన... సకాలంలో స్పందించడం ద్వారా కుట్రలు భగ్నం చేశామన్నారు. ఓట్ల దొంగలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారన్న చంద్రబాబు... పోలింగ్ ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారని మండిపడ్డారు. మొరాయించిన ఈవీఎంలను సరిచేయించేలోపే... శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు.

పోలింగ్‌పై ప్రజల్లో చక్కటి స్పందన వచ్చిందన్న చంద్రబాబు... చివర్లో వీడియో ద్వారా పిలుపివ్వడం ప్రజలను కదిలించిందన్నారు. చెన్నై, షిర్డీ, బెంగళూరు, హైదరాబాద్ నుంచీ భారీగా ప్రజలు తరలివచ్చారని అన్నారు. ఓట్లు వేయడానికి ఇదివరకెప్పుడూ ఇన్ని ఇబ్బందులు లేవన్న ఆయన... ఎన్ని కష్టాలు పడైనా ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అన్నారు. వీవీప్యాట్లను తీసుకొచ్చిన ఘటన టీడీపీదేనన్న చంద్రబాబు... వీవీప్యాట్‌లపై రూ.9,000 కోట్ల ఖర్చు ప్రజల్లో నమ్మకాన్ని పెంచడం కోసమేనన్నారు. ఇందుకోసం 23 పార్టీలు చేస్తున్న పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమేనన్నారు. 50% వీవీప్యాట్ రసీదులు లెక్కించడానికి ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించిన ఆయన... ఈవీఎంలపై ప్రజల్లో విశ్వసనీయత పోయిందన్నారు.


టీడీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో 110 నుంచీ 140 సీట్లు సాధిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వస్తోందన్న చంద్రబాబు... టీడీపీ గెలుపు 1000% తథ్యం అన్నారు. అన్ని వర్గాల ప్రజలూ టీడీపీవైపే ఉండటం వల్ల... టీడీపీ గెలుపు ఏకపక్షం అవుతుందన్నారు చంద్రబాబు.

 ఇవి కూడా చదవండి :

ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...

కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...
Loading...
మహిళలు వైసీపీకి ఓటు వేశారా... పోలింగ్ డే నాడు చంద్రబాబు వ్యూహం ఫెయిలైందా...

30 కోట్ల మంది కస్టమర్లు... దూసుకెళ్తున్న రిలయన్స్ జియో...
First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...