Home /News /andhra-pradesh /

TDP CHIEF CHANDRABABU NAIDU CONGRATULATES CIVIL SERVICES WINNERS PVN

UPSC Civil Services result: పేద‌రికం లేని స‌మాజం కోసం కృషి చేయాలి..సివిల్స్‌ విజేతలకు చంద్రబాబు అభినందనలు

చంద్రబాబు (ఫైల్)

చంద్రబాబు (ఫైల్)

Chandrababu Naidu Congratulates Civil Services Winners: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇంకా చదవండి ...
Chandrababu Naidu Congratulates Civil Services Winners: ఐఏఎస్ (IAS), ఐపీఎస్(IPS), ఐఎఫ్‌ఎస్‌ (IFS)తదితర కేంద్ర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Union Public Service Commission) నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల ప్రిలిమ్స్ (Civil Services prelims)‌–2021 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలో 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. సివిల్స్‌లో శృతి శర్మ మొదటి ర్యాంక్, అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్ సాధించారు. సివిల్స్ -2021లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మంచి ఫలితాలను సాధించారు.

ఈ సారి ఫలితాల్లో యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య 24, కొప్పి శెట్టి కిరణ్మ యి 56, శ్రీపూజ 62, గడ్డం సుధీర్ కుమార్రెడ్డి 69, ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి.చైతన్య రెడ్డి 161, ఎస్.కమలేశ్వ రరావు 297, విద్యా మరి శ్రీధర్ 336, దిబ్బడ ఎస్వీ అశోక్ 350, గుగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పు లూరి చైతన్య 470, మన్యా ల అనిరుధ్ 564, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్స న్ 602, బాణావత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్రాజ్ 676 ర్యాం కులు సాధించారు.

సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. వీరికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సోమ‌వారం ఓ ట్వీట్ చేశారు.


అఖిల భార‌త స‌ర్వీసు నియామ‌కాల కోసం యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2021లో ఉభ‌య రాష్ట్రాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు స‌త్తా చాటార‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. పేద‌రికం లేని స‌మాజ నిర్మాణానికి మీరంతా కృషి చేయాల‌ని... తద్వారా తెలుగు వారికి, త‌ల్లిదండ్రుల‌కు మంచి పేరు తీసుకురావాల‌ని ఆయ‌న కోరారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Chandrababu Naidu, Civil Services, Civils

తదుపరి వార్తలు