హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కారణం ఇదేనన్న టీడీపీ చీఫ్

Chandrababu: ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. కారణం ఇదేనన్న టీడీపీ చీఫ్

చంద్రబాబు, జగన్ (ఫైల్)

చంద్రబాబు, జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల ముందస్తు ఎన్నికలు అనే మాట తరచూ వినిపిస్తోంది. ఏపీలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష టీడీపీ (TDP) అంటూనే ఉంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల ముందస్తు ఎన్నికలు అనే మాట తరచూ వినిపిస్తోంది. ఏపీలో ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష టీడీపీ (TDP) అంటూనే ఉంది. ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. అదే జరిగితే టీడీపీకి 160 స్థానాలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారంటూ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతున్నందునే జగన్ ఆ ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏపీలో మహిళ గౌరవానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని మహిళలకు అమరావతి ఉద్యమమే స్ఫూర్తి కావాలన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని.. సీఎం జగన్ పక్కా బిజినెస్ మ్యాన్... పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ అంటూ ఘాటుగా విమర్శించారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడమే వైసీపీ పనిగా పెట్టుకుందని.., అసెంబ్లీలో తన భార్యను కించపరిచారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కానీ.. ఇప్పుడు కానీ భువనేశ్వరి ఎప్పుడైనా రాజకీయాల్లో కన్పించారా..? అని ఆయన ప్రశ్నించారు.

ఇది చదవండి: గవర్నర్లపై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు..


 ఇక మద్యపాన నిషేధం పేరుతో ప్రభుత్వం అబద్ధాలాడుతోందని చంద్రబాబు అన్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ల పాటు తకట్టుపెట్టడం ద్వారా.. అప్పటివరకు నిషేధం ఉండదని చెప్పకనే చెప్పిందని ఎద్దేవే చేశారు. చెత్తపై పన్ను వేస్తున్న ప్రభుత్వం.. మహిళల జుత్తుపైనా వేస్తుందన్నారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు జగన్ క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ అలా చేయకుంటే ప్రజలు క్షమించరని.. చెల్లెలికి న్యాయం చేయలేనివాడు రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

ఇది చదవండి: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా..? అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారా..?


ఇదిలా ఉంటే గతంలోనూ టీడీపీ నేతలు ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ పలుసార్లు వ్యాఖ్యానించారు. ఐతే దీనిపై సీఎం జగన్ గానీ, వైసీపీ అధిష్టానం గానీ స్పందించలేదు. ఐతే వారం లోపు రెండుసార్లు టీడీపీ నేతలు ముందస్తు ఎన్నికలపై కామెంట్స్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. రాజకీయ విమర్శల్లో భాగంగానే చంద్రబాబు అండ్ కో ఎన్నికల జపం చేస్తోందా..? లేక ఇందులో ఏమైనా నిజం దాగి ఉందా అనే అంశంపై చర్చ జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, Chandrababu Naidu

ఉత్తమ కథలు