TDP CHIEF CHANDRABABU EXPECTING 17 LOK SABHA SEATS AND GIVING 8 LOK SABHA SEATS TO YCP IN ITS SURVEY REPORT NK
లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?
చంద్రబాబు సర్వే రిపోర్ట్
Lok Sabha Election Exit Polls 2019 : ఢిల్లీ వెళ్లి యూపీఏ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న చంద్రబాబు... లోక్ సభ ఎన్నికలపై తన సర్వే రిపోర్టును ప్రదర్శించారు.
ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు... కాంగ్రెస్ సహా యూపీఏ పక్షాలతో సమావేశమై... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ యూపీఏ పక్షాల నేతలను కలిసి... ఈనెల 23న జరిగే సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతున్నారు. ఆ సమావేశానికి హాజరైతే... యూపీఏకి ఎంత బలం ఉందన్నది తెలుస్తుందనీ, తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధం అవ్వొచ్చని ఆయన భావిస్తున్నారు ఈ సందర్భంగా... ఆయన చంద్రబాబు తాను చేయించిన సర్వేలో ఏయే పార్టీలకు ఎన్నెన్ని ఓట్లు వస్తాయో వివరించారు. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్ సభ స్థానాలు ఉండగా టీడీపీకి 17 స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు దక్కుతాయని ఉంది. దీన్ని చూపించి... ఈసారి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందనీ, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతోందని చెబుతున్నారు చంద్రబాబు.
చంద్రబాబు సర్వే రిపోర్ట్
2009లో టీడీపీకి 6 లోక్ సభ స్థానాలు ఉండగా... 2014లో అవి 16కి చేరాయి. ఈ ఐదేళ్లలో అద్భుత పాలన అందించామని చెబుతున్న చంద్రబాబు... తమకు మరో స్థానం అదనంగా పెరిగి... 17 సీట్లు వస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో... 2009లో 2 లోక్ సభ స్థానాలున్న వైసీపీ... 2014లో 9 సీట్లు సాధించింది. ఈ ఐదేళ్లలో ఆ పార్టీ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదంటున్న చంద్రబాబు... ఈసారి వైసీపీకి 8 స్థానాలు మాత్రమే దక్కుతాయని చెబుతున్నారు. వైసీపీ జాతీయస్థాయిలో చక్రం తిప్పే ఛాన్సే లేదంటున్నారు. ఆ పార్టీని 23 సమావేశానికి పిలవాల్సిన అవసరమే లేదని యూపీఏ పక్షాలకు చెబుతున్నారు.
చంద్రబాబు సర్వే ప్రకారం... ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 179 సీట్లు వస్తుండగా... కాంగ్రెస్‌కి 129 సీట్లు దక్కుతున్నాయి. మిగతా 234 స్థానాలు... ఇతర పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయి. అందువల్ల 23న ఫలితాలు వచ్చిన తర్వాత... అన్ని బీజేపీయేతర పార్టీలూ ఒక్కటై... ఓ నిర్ణయానికి వచ్చి... బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చెయ్యాలని చంద్రబాబు కోరుతున్నారు. చిత్రమేంటంటే... వైసీపీ కూడా తమకు 15 లోక్ సభ స్థానాలు వస్తాయని చెబుతోంది. ఉన్నది 25 సీట్లే కాబట్టి... రెండు పార్టీల అంచనాలూ కరెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఏదో ఒక పార్టీ అంచనా మాత్రమే కరెక్ట్ అవ్వగలదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.