ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు... చంద్రబాబు టార్గెట్ ఇదీ...

Andhra Pradesh : గత టీడీపీ ప్రభుత్వం రకరకాలుగా అవినీతికి పాల్పడిందంటున్న వైసీపీ అధినేత జగన్... ఐదు నెలలుగా ఎందుకు అవినీతిని నిరూపించలేకపోతున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 18, 2019, 11:42 AM IST
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు... చంద్రబాబు టార్గెట్ ఇదీ...
చంద్రబాబు, జగన్
news18-telugu
Updated: October 18, 2019, 11:42 AM IST
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై క్రమంగా విమర్శల జోరు పెంచుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన తనదైన రాజకీయ వ్యూహ చతురత ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ నేతలు... టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమే కాక... రాష్ట్రాన్ని పెద్దఎత్తున లూటీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... ఇక చూస్తూ ఊరుకునేది లేదన్నారు. తమ పాలనలో ఏపీ అభివృద్ధివైపు అడుగులు వేస్తే... జగన్ సీఎం కాగానే... అభివృద్ధి పోయి... తిరోగమనం వైపు రాష్ట్రం నడుస్తోందని మండిపడ్డారు. ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు లేకపోయినా ఆచరణ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో అబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి గత ప్రభుత్వ తప్పిదం అంటూ మమ్మల్ని నిందిస్తున్నారు. టీడీపీ అవినీతికి పాల్పడి ఉంటే... 5 నెలలుగా ఎందుకు నిరూపించలేకపోయారో చెప్పాలి.
చంద్రబాబు, మాజీ సీఎం


 

Pics : అమాయక చూపుల అందాల రాశి తేజశ్వి
ఇవి కూడా చదవండి :


Health Tips : సీజనల్ ఫ్రూట్ సీతాఫలం తినండి... ఈ ప్రయోజనాలు పొందండి
Loading...
Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి


Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు
First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...