లాక్‌డౌన్ నేపథ్యంలో కార్మికులకు చంద్రబాబు పిలుపు.. ఏంటంటే..

అయితే చంద్రబాబు చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

అమరావతి, పోలవరం పనులు నిలిపివేత, వైసీపీ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ మూలంగా వలస కూలీలకు నిలువనీడలేకుండా అత్యంత దయనీయస్థితి నెలకొందన్నారు.

  • Share this:
    మే డే ను పురస్కరించుకుని దేశంలోని కార్మికులందరికీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కారణంగా మే డేను కార్మికులు సంతోషంగా జరుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వల్ల మే డేను కార్మికులు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒకరిగా నిలుస్తోన్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని అభినందించారు. లాక్‌డౌన్ వల్ల ఆటోలు, లారీలు డ్రైవర్లు, అసంఘటిత కార్మికుల ఉపాధికి పెనుప్రమాదం పరిణమించడం దురదృష్టకరమన్నారు. పరిశ్రమలు మూతపడటం, చేసేందుకు పనులు లేక అసంఘిత, వలస కార్మికులు, చేతి వృత్తిదారులు, పొట్టపోసుకునే వీలులేక బతుకులు దుర్భరంగా మారడం వ్యధ కల్గిస్తోందన్నారు.

    అమరావతి, పోలవరం పనులు నిలిపివేత, వైసీపీ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇసుక కొరతతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ మూలంగా వలస కూలీలకు నిలువనీడలేకుండా అత్యంత దయనీయస్థితి నెలకొందన్నారు. క్షుద్బాధ తీర్చేందుకు అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూతవేసిన వేళ.. దాతలు ముందుకు రావాలను పిలుపిచ్చారు. దాతలు ఉదారంగా భోజన సదుపాయాలు కల్పించడం ద్వారా కార్మికుల ఆకలి బాధ లేకుండా చేయడమే మే డేకు అసలైన పరమార్థమని పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published: