హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చంద్రబాబు బాటలో పవన్ కళ్యాణ్? అదే ట్వీట్... అదే రూట్?

చంద్రబాబు బాటలో పవన్ కళ్యాణ్? అదే ట్వీట్... అదే రూట్?

పవన్ కళ్యాణ్, చంద్రబాబు

పవన్ కళ్యాణ్, చంద్రబాబు

Pawan Kalyan : ఒకే అంశంపై ఏపీలో ప్రధాన ప్రతిపక్షాలు రెండూ స్పందించడం కాకతాళీయమే అయినప్పటికీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య తెరవెనక డీల్ కుదిరిందనే వాదనకు అది బలం చేకూరుస్తోందా?

Pawan Kalyan : అసలే ఏపీలో ఓ రాజకీయ పుకారు కలకలం రేపుతోంది. ఏంటంటే... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటయ్యాయనీ, ఆ మూడూ కలిసి... ఏపీలో అధికారం చేపట్టేందుకు వైసీపీని గద్దె దించేందుకు ప్రయత్నిస్తున్నాయని. అందుకు బలం చేకూరుస్తున్నట్లుగా... ఒకే అంశంపై ఒకే సమయంలో... అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ట్వీట్ చెయ్యడం ఆసక్తి రేపుతోంది. ఇది కాకతాళీయకంగా జరిగిందే అనుకున్నా... ఇప్పుడే ఇద్దరూ ఇలా స్పందించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏంటంటే... విజయనగరంలో గాంధీజీ విగ్రహానికి వైసీపీ శ్రేణులు... తమ పార్టీ జెండా రంగులు వేసుకున్న విషయాన్ని చంద్రబాబు ట్వీట్ రూపంలో ప్రశ్నించారు. అదే విషయంపై పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు.





ఇద్దరూ ఒకే అంశంపై, ఒకే సమయంలో ఒకే రకమైన ట్వీట్ చెయ్యడం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరతీసినట్లైంది. ప్రతిపక్షాలన్నాక... ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వేర్వేరు అంశాలపై ఒకే రకమైన పోరాటాలు చెయ్యడం సహజం. ఐతే... ఈ రంగులు వేసే కార్యక్రమం మూడు నెలలుగా సాగుతున్నా... ఇప్పుడే అటు టీడీపీ, ఇటు జనసేన అధినేతలు స్పందించడం కాకతాళీయకంగా జరిగిందా అన్న చర్చ సాగుతోంది.


ఏది ఏమైనా వైసీపీ ఇలా ప్రభుత్వానికి సంబంధించి కార్యాలయాలు, జాతీయ చిహ్నాలు, మహా నేతల విగ్రహాలకు సొంత పార్టీ రంగులు వేసుకుంటున్న విషయం మాత్రం విమర్శలకు దారితీస్తోంది. అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఏం చేసినా చెల్లుతుందనుకోవడం కరెక్టు కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


 

Pics : ఫ్యాషన్‌కి కొత్త అర్థం చెబుతున్న రెహనా బషీర్




ఇవి కూడా చదవండి :


మానవత్వం చచ్చిపోలేదు... రష్మీ గౌతమ్ రీట్వీట్


Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

First published:

Tags: AP News, Chandrababu naidu, Janasena party, Pawan kalyan, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు