ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు

Chandrababu Naidu : ప్రజలే తన బలం... ప్రజల కోసమే తన జీవితం అంటూ చంద్రబాబు వైసీపీపై పోరుబాట సాగిస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

news18-telugu
Updated: November 11, 2019, 5:36 AM IST
ఏపీని ఆత్మహత్యలప్రదేశ్ చేశారు... వైసీపీపై చంద్రబాబు సెటైర్లు
చంద్రబాబు, జగన్
  • Share this:
Andhra Pradesh : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటేయడంతో... సర్కారుపై తన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తోంది టీడీపీ. ఆ పార్టీ నుంచీ ఎన్నికల్లో గెలిచింది 23 మంది ఎమ్మెల్యేలే అయినా... పార్టీలో ఇదివరకటి ఉత్సాహం లేకపోయినా... అధినేత చంద్రబాబు మాత్రం పట్టువీడట్లేదు. ఎప్పటికప్పుడు తన రాజకీయ చతురతతో విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా అస్త్రాలు సంధించారు. తెనాలిలో అబ్దుల్ రజాక్ అనే మైనారిటీ వర్గానికి చెందిన యువకుడు, దివ్యాంగుడు.... వైసీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడన్న చంద్రబాబు... ఉన్నపళంగా ఉద్యోగంలోంచి తీసేసే కొత్త సంప్రదాయం ఏంటని తాను అడుగుతున్నానని అన్నారు.

వైసీపీ కార్యకర్తల ఉపాధి కోసం, ఆల్రెడీ ఉన్నవాళ్లను ఉద్యోగాల్లోంచీ తీసేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు... గతంలో ఎప్పుడైనా ఉందా ఈ దుష్ట విధానం అని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆత్మహత్యాయత్నాలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించిన టీడీపీ అధినేత... కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం చేతకాని వైసీపీకి, ఉన్నవాళ్ళను తొలగించే హక్కు ఎక్కడిది అని ట్వీట్ చేశారు.పెట్టుబడులు పెట్టేవాళ్లను బెదిరించి తరిమేశారన్న చంద్రబాబు... పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన పడకేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను బెదిరించి ఆత్మహత్యల పాల్జేశారన్న ఆయన... 5 నెలల్లోనే వైసీపీ నేతలు, రాష్ట్రాన్ని ఆత్మహత్యలప్రదేశ్‌గా మార్చి అప్రతిష్ట తెచ్చారని విరుచుకుపడ్డారు. రజాక్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Pics : పూజాహెగ్డే డ్రెస్ డిజైనర్ ఎవరో తెలుసా?ఇవి కూడా చదవండి :

Health Tips : బంగాళాదుంపల్ని ఇలా వండితే మేలు


Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం

1.2 కేజీల పీత... ఎంతకు అమ్ముడైందో తెలిస్తే షాకే...

గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు మరో 4 కేసులు...

25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్

జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...
Published by: Krishna Kumar N
First published: November 11, 2019, 5:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading