టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?

AP Assembly Election 2019 : ఏపీ అసెంబ్లీలో గెలుపు ఎవరిదో మరో వారంలో తేలిపోతుంది. ఈలోపు 19న ఎగ్జిట్ సర్వేలు కూడా రాబోతున్న సమయంలో... చంద్రబాబు తమ శ్రేణులకు ధైర్యం చెబుతుంటే, వైసీపీ విమర్శలతో దూకుడు పెంచింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 15, 2019, 5:49 AM IST
టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?
చంద్రబాబు (File)
  • Share this:
టీడీపీ చేయించిన నాలుగు సర్వేలపై ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేగుతోంది. చిత్రమేంటంటే నాలుగు సర్వేల్లోనూ టీడీపీయే గెలుస్తుందని తెలిసింది. మొదటి సర్వేలో టీడీపీకి దాదాపు 150 సీట్లు వస్తాయని రావడంతో... ఆ సర్వేను పక్కన పెట్టిన పార్టీ అధినేత చంద్రబాబు... మరోసారి సర్వే చేయించారని తెలిసింది. రెండో సర్వేలో 110 సీట్లు వస్తాయని తెలియగా... ఈ రెండు సర్వేలతోపాటూ... పార్టీ నేతలకు కూడా తెలియకుండా చంద్రబాబు మరో రెండు సర్వేలు చేయించారని తెలిసింది. ఆ రెండు సీక్రెట్ సర్వేల్లోనూ టీడీపీకి 100 నుంచీ 120 సీట్ల దాకా వస్తాయని తేలడంతో... అన్నింటినీ లెక్కలోకి తీసుకొని చివరకు చంద్రబాబు 110 సీట్లకు కన్‌ఫాం అయ్యారని తెలిసింది. ఐతే... గెలుస్తామనే ధీమా ఉంటే నాలుగు సర్వేలు ఎందుకు చేయించారని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఓటమి భయంతో ఉన్న చంద్రబాబు... తమ సర్వేలపైనే నమ్మకం లేక... నాలుగు సర్వేలు చేయించారని విమర్శలు చేశారు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.టీడీపీ సర్వేల్లో తేలిందేంటి? : టీడీపీ జరిపించిన సర్వేల ప్రకారం... ముసలివాళ్లు, మహిళలు టీడీపీకి ఓటు వెయ్యగా... యువత మాత్రం వైసీపీకే ఓటు వేశారని తేలిందని సమాచారం. పథకాలు వాటి అమలు విషయంలో ప్రజలు కొంతవరకూ సంతృప్తిగానే ఉన్నప్పటికీ... ఉద్యోగాల కల్పనలో మాత్రం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోవడం వల్ల యువత వైసీపీ వైపు మళ్లారని అంతర్గత సర్వేల్లో తేలినంట్లు తెలిసింది. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కూడా టీడీపీకి నష్టం చేసిందని చంద్రబాబు తన సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు సమాచారం. కేంద్ర నిధులు సకాలంలో రాకపోవడం, పోలవరం సహా చాలా బిల్లులు పెండింగ్‌లో పెట్టడం వల్ల అమరావతి నిర్మాణం సహా... అభివృద్ధి విషయంలో వెనకబడ్డామనీ, ఆ ప్రభావం ఓట్లపై కనిపిస్తోందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది.

2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ - వైసీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువే. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా... టీడీపీ 102 సీట్లు గెలిచింది. ఆ పార్టీకి 46.30 శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీ 67 సీట్లు సాధించగా ఆ పార్టీకి 44.47 శాతం ఓట్లు లభించాయి. అంటే 1.83 శాతం ఓట్ల తేడాతో.. 35 సీట్లు తారుమారయ్యాయి. ఐతే... టీడీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని వైసీపీ అంటుంటే... తమ పాలనపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారంటున్న చంద్రబాబు... అందుకే ఈసారి 2014లో కంటే 8 సీట్లు ఎక్కువే సాధిస్తామన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ వర్గాలు తమకు 120 నుంచీ 140 స్థానాలు రావచ్చని చెబుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలూ టీడీపీకి షాక్ ఇవ్వబోతున్నారని అంటున్నాయి.గెలుపు ధీమాలో వైసీపీ : మరో వారమే అంటూ టీడీపీపై విరుచుకుపడుతున్న వైసీపీ మాత్రం గెలుపుపై భారీ అంచనాలతో ఉంది. కచ్చితంగా సీఎం అవుతాననే ఉద్దేశంతో ఉన్న ఆ పార్టీ అధినేత జగన్... తాజాగా అమరావతి నుంచీ పాలన మొదలుపెట్టేందుకు పార్టీ వ్యవస్థను, ఫర్నిచర్‌ను లోటస్‌పాండ్ నుంచీ గుంటూరులోని తాడేపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయానికి షిప్ట్ చేశారు. దీనర్థం కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందనే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ వైసీపీకే అనుకూలంగా చెప్పబోతున్నాయని వంద శాతం కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ విషయంలో టీడీపీ కూడా నిజమే అంటోంది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ వైసీపీకే అనుకూలంగా ఉండబోతున్నాయనీ, అందుకు కారణం సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య, అనవసర ప్రచారమే అంటోంది. ఫలితాలు వచ్చాక, వైసీపీకి అసలు నిజం తెలిసొస్తుందని చెబుతోంది.

 

ఇవి కూడా చదవండి :

ఏపీలో బుకీలకు షాక్... బెట్టింగ్ రద్దు చేసుకుంటున్న ప్రజలు... ఐపీఎల్ ఎఫెక్ట్...

మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ... టీడీపీ రిపోర్టులో ఏం తేలిందంటే...
First published: May 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading