హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.. కౌరవసభలో అడుగు పెట్టనన్న చంద్రబాబు..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ.. కౌరవసభలో అడుగు పెట్టనన్న చంద్రబాబు..

చంద్రబాబు నాయుడు (ఫైల్)

చంద్రబాబు నాయుడు (ఫైల్)

Chandrabau on jagan: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ- ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల రెండు రోజు జరిగిన అంశం ఇప్పటికే రచ్చ చేస్తూనే ఉంది. ఆ రోజే ఇక సభలో అడుగుపెట్టేది లేదని.. మళ్లీ సీఎం అయిన తరువాత అసెంబ్లీకి వస్తానంటూ శపథం చేశారు చంద్రబాబు.. మళ్లీ మరోసారి అదే మాట చెప్పిన చంద్రబాబు.. జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

Chandrababu Vs Jagan:  ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. వీరిద్దిరిది ఇప్పటి శత్రుత్వం కాదు.. గత దశాబ్దకాలంగా రాజకీయ ప్రత్యర్థులగా ఢీ అంటే ఢీ అంటున్నారు.  ఇంతకాలం అది రాజకీయ వైరంగానే ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా హీటెక్కింది. వ్యక్తిగత శత్రువులగా మారిపోతున్నారు. ఇద్దరి నోటి నుంచి ఏ మాట వచ్చినా.. అది ప్రత్యర్థిపై మాటల దాడి చేయడమే లక్షంగా వస్తోంది. అసెంబ్లీలో చంద్రబాబు లేకున్నా.. సీఎం జగన్ చంద్రబాబు పేరు ప్రస్తావించి విమర్శలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబు సైతం వరద ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్లిన సీఎం జగన్ నే నేరుగా టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను కౌరవ సభలో ఉండలేనంటూ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. అక్కడితోనే ఆగలేదు.. తాను మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాతే సభలో అడుగు పెట్టేది అంటూ శపథం చేశారు.. జగన్ అధ్యక్షతన కౌరవ సభగా మారిందని.. తాను దాన్ని గౌరవ సభ గా తీర్చిదిద్దుతాను అన్నారు. సీఎం జగన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నాడు..తాను ఎందరో ముఖ్యమంత్రులను చూసానని అన్నారు. సీఎం సొంత జిల్లా కడప (Kadapa District)కు రెండున్నర సంవత్సరాల్లో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాలైనా చేశారా అంటూ చంద్రబాబు నిలదీశారు.

తాజాగా భారీ వర్షాల (Heavy Rains) గురించి ముందే వాతావరణ శాఖ హెచ్చరించిందని.. ప్రాజెక్ట్ లోకి ఇన్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ప్రభుత్వం, అధికారులు ఏమి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరద భారీగా ఉన్నప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు సరైన సమయంలో ఎత్తలేదని అందుకనే గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోయాయన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిసినా.. సీఎం జగన్ మాత్రం నింగిలోనే విహరిస్తారని సెటైర్లు వేశారు. నేల మీద ఉన్న వారిని చూసి చులకన చేస్తారని.. ప్రజలకు అందనంత దూరంలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎందుకు అంటూ చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చదవండి: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పేంటి అని ఫ్యాన్స్ ఫైర్

అసెంబ్లీలో భారీగా ఉపన్యాసాలిస్తారు. క్షేత్రస్థాయిలో జనం బాధలను పట్టించుకోరా అని నిలదీశఆరు. ప్రత్యర్థులు ఒక మాట అంటే పది తిట్లతో జవాబిస్తారని.. ఆయనకు కోరస్‌గా బూతుల మంత్రులు ఉండనే ఉన్నారంటూ ఎద్దేవ చేశారు. జనం కోసం జనంలో తిరుగుతూ జనం బాధలను అర్థం చేసుకున్న విపక్షాలు ప్రజల సహేతుకమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినా కౌంటర్ అటాక్‌తో వారి నోరు మూయించేందుకు ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: టీడీపీలో చేరాలి అనుకునేవారికి షాక్.. వలపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

ఇక ఏపీలో ఇసుక మాఫియా చెలరేగి పోతోందంటూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. ఒక ఎమ్మెల్యే చెరువు లో క్రికెట్ స్టేడియం కట్టుకున్నాడు. మొత్తంగా జగన్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడం లో విఫలమయ్యింది అంటూ చంద్రబాబు చెప్పారు. ఏపీ రాష్ట్రాన్ని కాపాడటం చారిత్రక అవసరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మద్యం ఆదాయం తో సంక్షేమం చేస్తామని..చట్టం చేశారు.. మంగళ సూత్రాలు తాకట్టు పెడతారా.. అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, TDP

ఉత్తమ కథలు