హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రేపటి నుంచీ ఐదు రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు... ఎన్నికలు జరిగే రోజున కూడా...

రేపటి నుంచీ ఐదు రోజులు టీడీపీ నిరసన కార్యక్రమాలు... ఎన్నికలు జరిగే రోజున కూడా...

AP Assembly Elections : ఎన్నికల రోజు వరకూ టీడీపీ నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రచారంతోపాటూ... సెంటిమెంట్ రగిల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా?

AP Assembly Elections : ఎన్నికల రోజు వరకూ టీడీపీ నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రచారంతోపాటూ... సెంటిమెంట్ రగిల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా?

AP Assembly Elections : ఎన్నికల రోజు వరకూ టీడీపీ నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ప్రచారంతోపాటూ... సెంటిమెంట్ రగిల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలకి తోడు ఎన్నికల హీట్ బాగా పెరిగింది. దాన్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నుంచీ 5 రోజుల పాటూ నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చారు. టీడీపీ అభ్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై కావాలని దాడులు చేస్తున్నారనీ, టీడీపీ నేతలు, కార్యకర్తల్ని దాడులు, సోదాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడుల వెనక కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ ఉన్నారనీ... ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాల రాసేందుకు జరుగుతున్న కుట్రల్ని ప్రజలంతా ఖండించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు.

దాడుల్ని నిరసిస్తూ... ఇప్పటికే టీడీపీ శుక్రవారం ర్యాలీలు నిర్వహించింది. శనివారం ఉగాది కావడంతో ఇవాళ నిరసన కార్యక్రమాలు పక్కనపెట్టి... పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఆదివారం అన్ని ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదులు, ఆలయాల్లో రాష్ట్రం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. సోమవారం మహిళలు, తటస్థులతో సంఘీభావ ప్రదర్శన ఉంటుందట. 9న టీడీపీ అభ్యర్థులకు మహిళలు వీర తిలకం దిద్ది చివరి రోజు ఎన్నికల ప్రచారానికి పంపనున్నారు. 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పసుపుదీక్ష చేపట్టబోతున్నారు. ఆ రెండు రోజులూ మహిళలు, యువత, రైతులు అంతా పసుపు దుస్తులు ధరించాలని చంద్రబాబు సూచించారు.

ఈ దీక్షలు మోదీ, జగన్, కేసీఆర్‌కి వ్యతిరేకంగా అని టీడీపీ చెబుతున్నా... ఇవి ఎన్నికల ప్రచారానికి కూడా అనుకూలంగా ఉండేలా చంద్రబాబు వ్యూహం రచించారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 10, 11న పసుపు డ్రెస్ వేసుకురమ్మనడం కూడా ఎన్నికల ప్రచారంలో భాగమే అనుకోవచ్చు. కానీ అలాంటి డ్రెస్ వేసుకురాకూడదన్న రూలేదీ లేదు. దాన్ని క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు... తద్వారా ఎంతమంది తమకు అనుకూలంగా ఓటు వేస్తున్నారన్నది తెలుసుకునే అవకాశాలున్నాయి.


ఇవి కూడా చదవండి :

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

#Health Tips: పెసలు తింటే ఎన్ని లాభాలో చూడండి..

చుండ్రుని పోగొట్టి.. జుట్టు అందంగా మారాలంటే ఇలా చేయండి..

First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, CM KCR, Narendra modi, Ys jagan

ఉత్తమ కథలు