Chandrababu Naidu: షాకింగ్.. చంద్రబాబు సొంత జిల్లాలో ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.. ఎందుకంటే..

చంద్రబాబు (ఫైల్ ఫోటో)

Chandrababu Naidu: 31 వార్డులు ఉన్న పుంగనూరు మున్సిపాలిటీలో 3 వార్డులకి మాత్రమే ఎస్ఈసి నామినేషన్ వెయ్యడానికి ఆహ్వానించడంతో టీడీపీ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

  • Share this:
    మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ఆశలు నెరవేరలేదు. 31 వార్డులు ఉన్న పుంగనూరు మున్సిపాలిటీలో 3 వార్డులకి మాత్రమే ఎస్ఈసి నామినేషన్ వెయ్యడానికి ఆహ్వానించడంతో టీడీపీ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఈసీ నిబంధనల మేరకు మూడు వార్డులకు మాత్రమే నామినేషన్స్ స్వీకరిస్తామని మునిసిపల్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పుంగనూరు టీడీపీ పుంగనూరు ఇంచార్జ్ అనిషా రెడ్డి ఎన్నికలు బహిష్కరిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలు రాష్ట్ర ఎన్నికల సంఘంపై విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గాంధీ కలలుకన్న స్వరాజ్యం., అంబేద్కర్ రాసిన రాజ్యంగాన్ని అధికార పార్టీ నాయకులు తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. నిన్మ చంద్రబాబును జిల్లా అధికారులు తీవ్రంగా అవమానించారని., కలెక్టర్, ఎస్పీతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారని అన్నారు. అధికార పార్టీ చేస్తున్న దాడులు., పోలీసుల వేధింపులతో ఎన్నికలపై విరక్తితో ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రసంగం మధ్యలో తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు అనిషా రెడ్డి.

    అయితే అధికారులు మాత్రం ఈ విషయంలో తాము ఎస్ఈసీ ఆదేశాల ప్రకారమే వ్యవహరించామని చెబుతున్నారు. పుంగనూరులో మున్సిపాలిటీ లో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 31 వార్డులకు గాను 3 వార్డులకు ఎస్ఈసీ అవకాశం కల్పించారని, అందులో 16 వార్డులకు సింగల్ నామినేషన్‌లు మరికొంత మంది తమ నామినేషన్‌లు ఉపసంహరణ చేసుకున్నారని తెలిపారు. కానీ 9,14 ,28 వార్డులకు నామినేషన్ వేసేందుకు ఎవ్వరు రాలేదని ఎన్నికల అధికారి లోకేశ్వర్ వర్మ వివరణ ఇచ్చారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో విపక్ష టీడీపీకి షాక్ ఇచ్చిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే దూకుడును కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published: