హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KCR-Andhra Pradesh: ఏపీపై కేసీఆర్ ఫోకస్.. అదే జరిగితే.. టీడీపీ, వైసీపీలు అలా కౌంటర్ ఇస్తాయా ?

KCR-Andhra Pradesh: ఏపీపై కేసీఆర్ ఫోకస్.. అదే జరిగితే.. టీడీపీ, వైసీపీలు అలా కౌంటర్ ఇస్తాయా ?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

KCR: ఏపీలో తాను ఆశించిన విధంగా ఓట్లు సాధించడం కోసం కేసీఆర్ ఫోకస్ చేశారని.. ఇందుకోసం పలువురు నేతలను తన కొత్త పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  జాతీయ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం చూపాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇందుకోసం పొరుగు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో పని చేసిన కేసీఆర్(KCR).. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. ఈ కారణంగా ఆయనకు ఏపీలోని అనేక మంది నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలతో స్నేహం ఉంది. అప్పుప్పుడు తన పాత మిత్రులు యోగక్షేమాలు తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ వారి ఇళ్లకు వెళ్లడం కూడా జరిగింది. పలు శుభకార్యాలకు హాజరయ్యేందుకు ఏపీకి కూడా వెళ్లొచ్చారు. ఈ స్నేహం, సాన్నిహిత్యం కారణంగా కేసీఆర్ కొంతమంది నేతలు తనతో కలిసి జాతీయ పార్టీలో పని చేసేందుకు ముందుకు రావాలని కోరినట్టు వార్తలు వస్తున్నాయి.

  ముఖ్యంగా ఒకప్పుడు తనతో కలిసి టీడీపీలో పని చేసిన నేతలకు ఆయన ఈ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కేసీఆర్ ఇప్పటివరకు ఏయే నాయకులకు ఈ మేరకు ఆహ్వానించారు ? వారిలో ఎంతమంది ఆయనతో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ? అయితే కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ఏపీలో టీడీపీతో(TDP) పాటు వైసీపీ(Ysrcp) కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ కారణంగా ఇప్పటికప్పుడు ఏపీలో తమకు వచ్చిన ముప్పేమీ లేదని టీడీపీ , వైసీపీ భావిస్తున్నాయి.

  అయితే ఆయన రాజకీయ పార్టీ ఏపీలో ఎదగకుండా చూడాలనే ఆలోచన ఈ రెండు పార్టీలకు ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీలోనూ మంత్రిగా పని చేసిన కేసీఆర్‌కు ఇక్కడ రాజకీయాలు, రాజకీయాలను ప్రభావితం చేసే అంశాల గురించి చాలా అవగాహన ఉంది. అందుకే కేసీఆర్ ఏపీలో ఏ వర్గాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారో అనే టాక్ అక్కడి రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు సాధించాలంటే పలు రాష్ట్రాల్లో ఓ నిర్ధిష్టమైన ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

  KCR-Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ కీలక నిర్ణయం..

  Balakrishna: అన్‌స్టాపబుల్ సీజన్ 2.. బాలకృష్ణ, చంద్రబాబు కలిసి వైసీపీకి కౌంటర్ ఇవ్వబోతున్నారా ?

  ఆ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్ ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. అందుకే ఏపీలో తాను ఆశించిన విధంగా ఓట్లు సాధించడం కోసం కేసీఆర్ ఫోకస్ చేశారని.. ఇందుకోసం పలువురు నేతలను తన కొత్త పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారని వార్తలు జోరందుకున్నాయి. అయితే కేసీఆర్ ఏపీ రాజకీయాలపై సీరియస్‌గా ఫోకస్ పెడితే.. ఏపీలోని అధికార, విపక్షాలు ఏ రకమైన వ్యూహంతో ఆయనను అడ్డుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, CM KCR, Telangana

  ఉత్తమ కథలు