పిల్లలను బడికి పంపితే అమ్మఒడి పథకం కింద ఆ తల్లికి ఏడాదికి రూ.15,000 ఇస్తామని మొదటి నుంచీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈ హామీని మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేయడం, పుస్తకాలు, యునిఫారం సకాలంలో అందజేయడం, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ప్రతి విద్యార్థికి ఏటా రూ.20వేలు, అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాలు పూర్తిస్థాయిలో భర్తీ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు తగ్గింపు, గిరిజనులకు ప్రత్యేక యూనివర్సిటీ, రాజధానిని ఫ్రీజోన్‌గా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి సాధిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు జగన్.
తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిడ్డను బడికి పంపే ప్రతీ అమ్మకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని చెప్పారు. అంటే... వైసీపీ ఇస్తామన్న దానికంటే... చంద్రబాబు మరో రూ.3,000 అదనంగా ఇస్తామన్నట్లు లెక్క.
వైసీపీ హామీ ప్రకారమైతే... ఒక పాప లేదా బాబును స్కూలుకు పంపితే... ఆ తల్లికి నెలకు రూ.1250 వస్తుంది. అదే టీడీపీ హామీ ప్రకారమైతే ఒక పాప లేదా బాబును స్కూలుకు పంపితే... ఆ తల్లికి నెలకు రూ.1500 వస్తుంది.
చంద్రబాబు ఈ స్కీమును ఇప్పుడే ప్రకటించినట్లు తెలుస్తోంది. వైసీపీ హామీకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో... అదే తరహా స్కీమును... మరింత ఎక్కువ మొత్తంతో హామీగా ఇస్తే... ప్రజల మద్దతు తమకే ఉంటుందని టీడీపీ భావిస్తున్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి :
నా భర్తే తన ఫ్రెండ్స్‌తో పడుకోమన్నాడు... ఓ భార్య వ్యథ...
పోలవరం నిజం.. ఎవరు పూర్తిచేస్తే వారికే ఓటేయండి: హీరో శివాజీ
మేనిఫెస్టోల పండగ ముగిసింది... ఇక పోల్ స్ట్రాటజీపై దృష్టిపెడుతున్న పార్టీలు... ఎలాగంటే...
ప్రచారానికి మిగిలింది మూడు రోజులే... బయటికొస్తున్న నోట్ల కట్టలు... ఎలక్షన్స్ ఫీవర్‌లో పార్టీలు నేతలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, TDP, Ys jagan, Ysrcp