అందుకే అసెంబ్లీ బహిష్కరణ..గవర్నర్‌కు టీడీఎల్పీ లేఖ

బీఏసీ అజెండాకు విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలను నాలుగో రోజు పొడగించారని గవర్నర్‌కు రాసిన లేఖలో టీడీపీ శాసనసభాపక్షం ఆరోపించింది.

news18-telugu
Updated: January 27, 2020, 11:20 AM IST
అందుకే అసెంబ్లీ బహిష్కరణ..గవర్నర్‌కు టీడీఎల్పీ లేఖ
టీడీపీ లోగో, చంద్రబాబు నాయుడు
  • Share this:
ఏపీ  సమావేశాల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆరోపించింది. ఈ మేరకు గవర్నర్, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తూ టీడీఎల్పీ రెండు పేజీల లేఖ రాసింది. అసెంబ్లీ సమావేశాలను మూడు రోజులే నిర్వహించాలని బీఏసీ నిర్ణయించినట్లు గుర్తుచేసింది. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోకుండానే అసెంబ్లీ సమావేశాలను ఇష్టానుసారం నాలుగో రోజు సోమవారం కూడా పొడగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఇది బీఏసీ అజెండాను ఉల్లంఘించడమేనని ఆరోపించింది టీడీఎల్పీ.  మండలి సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపిన బిల్లులను అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించింది.  ఇది రూల్స్‌కి విరుద్ధమని పేర్కొంది.  చెడు సాంప్రదాయాలకు నాంది పలికేలా అసెంబ్లీని నడుపుతున్నారని టీడీఎల్పీ తన లేఖలో  ఆక్షేపించింది. రాజ్యాంగ విరుద్ధం గా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బహిష్కరిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.

గవర్నర్, స్పీకర్‌లకు టీడీఎల్పీ పంపిన లేఖ


గవర్నర్, స్పీకర్‌లకు టీడీఎల్పీ పంపిన లేఖ


అటు నాలుగో రోజు సోమవారం అసెంబ్లీ సమావేశమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సభను వాయిదావేశారు. బీఏసీ సమావేశం తర్వాత సభ మళ్లీ ప్రారంభంకానుంది. బీఏసీ నిర్ణయం మేరకు మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ జరపనున్నారు. మండలి రద్దుకు ఆమోదం తెలుపుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలి రద్దు వ్యవహారంపై అసెంబ్లీలో ఎంతసేపు చర్చించాలన్న అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది.మరోవైపు  చంద్రబాబు నేతృత్వంలో టీడీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మండలి రద్దు, టీడీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు