chandrababu bus tour-lokesh padayatra: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party ) పావులు కదుపుతోంది. అయితే ఇప్పటికే ఒకవేళ టీడీపీ నెగ్గితే చంద్రబాబ నాయుడే (Chandrababu naidu) సీఎం అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబును చూపించే టీడీపీ ఎన్నికలకు వెళ్లనుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో అధికారం చేపట్టడం అంత ఈజీ కాదు. 2019 సాధారణ ఎన్నిక తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ భంగాపటు తప్పడం లేదు. డిపాజిట్ దక్కితేనా గొప్ప అనే పరిస్థితి ఉంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy) గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతున్న పేపథ్యంలో అధికారం చేజిక్కించుకోవడం మాటలే.. ప్రభుత్వం పై పూర్తి వ్యతిరేకతైనా పెరగాలి.. లేద టీడీపీ నేతలు శ్రమకు మించి కష్టపడాల్సి ఉంటుంది. అలాగే అప్పటి పొత్తులపైనా ఫలితం ఆధారపడి ఉంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా తనకు అనుకూలంగా మార్చుకునే రాజకీయ చాణిక్యం చంద్రబాబు సొంతం.. ఎన్నో సార్లు సమస్యలను అవకాశాలుగా మలుచుకున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదు అనుకుంటున్నారు చంద్రబాబు. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం.. దానికి తోడు ప్రజల్లో సింపతీ పెరిగేలా చేయడం.. ఇలా పలు రకాల వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. అక్కడక్కడ కొన్ని పరిస్థితులు కూడా ఆయనకు కాస్త అనుకూలంగా కలిసి వస్తున్నాయి. అందుకే 2024 ఎన్నికలను టార్గెట్ చేయడానికి ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నారు. యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు..
ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజా క్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లలలో చర్చ జరుగుతోంది. తాను ఒక్కడినే కాదు.. ఇటు లోకేష్ భవిష్యత్తుపైనా వ్యూహాలు రచిస్తున్నారు. కాబోయే సీఎం చంద్రబాబే అనే నినాదంలో ప్రజల్లోకి వెళ్లినా.. అధికారం వచ్చిన తరువాత మొత్తం పగ్గాలు లోకేష్ కు అప్పచెప్పే అవకాశాలు లేకపోలేదు. అది జరగాలంటే లోకేష్ ముందు ప్రజా క్షేత్రంలో నిలిచి గెలవాల్సి ఉంది.
ఇదీ చదవండి: : కరవు సీమలో ఎప్పుడూ చూడని అద్భుతం.. ఆగకుండా ఉబికి వస్తున్న పాతాళ గంగ
అన్నింటిని బేరీజు వేసుకుంటూ.. వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై శుక్రవారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్ర చేస్తారని చర్చ నడుస్తోంది. ఈ యాత్రల ద్వారా వైసీపీ సర్కారు వైఫల్యాలను వీరిద్దరూ ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. అయితే వయసు రీత్యా చంద్రబాబు పాదయాత్ర చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుందని.. అందుకే పాదయాత్రను చిన్నబాబుకు అప్పగించారని తెలుస్తోంది.
అన్నింటికంటే ముఖ్యంగా ఏపీలోని 175 నియోజకవర్గాలకు కనీసం 100 నియోజకవర్గాల్లో రెండేళ్లు ముందుగానే అభ్యర్థులకు టికెట్ గ్యారెంటీ ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందట. మరోవైపు మేనత్త భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానిస్తే కనీసం జూనియర్ వార్నింగ్ ఇవ్వలేదన్న అంశంపైనా టీడీపీ పొలిట్ బ్యూరో చర్చించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చిన అంశం కూడా చర్చించినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Nara Lokesh, TDP