హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో కరోనా గోడల కూల్చివేత

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో కరోనా గోడల కూల్చివేత

గోడను కూల్చుతున్న అధికారులు

గోడను కూల్చుతున్న అధికారులు

తమిళనాడు అధికారుల తీరుతో చుట్టు పక్కల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు వేలూరు కలెక్టర్ దిగొచ్చారు.

  ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డు మీద గోడలు కట్టడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు జరగకుండా అడ్డంగా గోడలను పెట్టేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాకపోకలను నిలిపివేసినట్లు వేలూరు జిల్లా అధికారులు చెప్పారు. ఐతే తమిళనాడు అధికారుల తీరుతో చుట్టు పక్కల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు తమిళనాడులోని వేలూరు కలెక్టర్ దిగొచ్చారు. ఆంధ్రా సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా కట్టిన ఆ గోడలను ప్రొక్లెయినర్లతో మళ్లీ కూల్చివేశారు.

  Corona Warrior, extend the lockdown, corona update, coronavirus outbreak, coronavirus lockdown, coronaupdate, fight with corona virus, covid19, కరోనా లాక్‌డౌన్, కరోనా అప్‌డేట్, కరోనా న్యూస్,
  ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో గోడ

  కాగా, కరోనా కట్టడి కోసం అంటూ ఏపీ సరిహద్దుల దగ్గర గోడలను నిర్మించారు తమిళనాడు అధికారులు. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో గోడలను నిర్మించారు. వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రోడ్డుకు అడ్డంగా 6 అడుగుల ఎత్తున రాత్రికి రాత్రే గోడలను కట్టేశారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్‌తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. దాంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అత్యవసర సేవలు, నిత్యవసర సరకుల రవాణా కూడా లేకుండా పోయింది. అధికారుల తీరుపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయని..కానీ గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపించాయి. అటు మీడియాలో వార్తలు రావడంతో ఎట్టకేలకు దిగొచ్చి గోడలను కూల్చివేశారు తమిళనాడు అధికారులు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: AP News, Coronavirus, Covid-19, Tamilnadu

  ఉత్తమ కథలు