KIA Motors : కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందా?

KIA Motors : కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందా?

KIA Motors : కియా మోటార్స్ తమిళనాడుకు తరలిపోతోందా?

KIA Motors : కియా మోటార్స్ తమిళనాడుకు వెళ్లట్లేదని అంతా చెబుతున్నా... అసలా అంశాన్ని తెరపైకి తెచ్చింది రాయిటర్స్ కావడంతో... తెరవెనక ఏదో జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది.

  • Last Updated:
  • Share this:
    KIA Motors : తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కియా మోటార్స్ అంశం కుదిపేస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన ఓ కథనం ఇప్పుడు అందర్నీ ఆలోచనలో పడేస్తోంది. దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... ఆంధ్రప్రదేశ్‌... అనంతపురం జిల్లాలో ఏర్పాటై... గత డిసెంబర్ నుంచీ ఉత్పత్తి చేపట్టిన విషయం అందరికీ తెలుసు. ఐతే... ఈ... ఏపీ కొత్త ప్రభుత్వ పాలసీలతో ఎడ్జస్ట్ అవ్వలేకపోతున్న కియా మోటార్స్... మెల్లగా తమిళనాడు రాష్ట్రంలోకి తరలిపోయేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందన్నది రాయిటర్స్ సంస్థ కథనం. ఈ కథనాన్ని కియా మోటార్స్, ఏపీ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఖండించింది. కియా మోటార్స్ తమతో ఎలాంటి చర్చలూ జరపలేదని తెలిపింది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ఈ అంశంపై రాజకీయ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించాలని ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

    పైన చెప్పిన అంశాల్ని బట్టీ చూస్తే... ఇదంతా రాయిటర్స్ సంస్థ ఇచ్చిన కథనం వల్లే రేగిన దుమారం అని అర్థమవుతోంది. ఏ తరలింపూ లేకపోయినా... రాయిటర్స్ సంస్థ ఓ పుకారును ప్రచారం చేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఐతే... రాయిటర్స్ సంస్థ అల్లాటప్పా సంస్థ కాదు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంస్థ. అలాంటి కంపెనీ ఇలాంటి వార్త ఇవ్వడంతో ఇది దుమారం రేపుతోంది. రాయిటర్స్ కథనంలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందనీ, ఏమీ లేకుండా కల్పించి ఇవ్వాల్సిన ఖర్మ రాయిటర్స్‌కి లేదనే ప్రచారం ఇప్పుడు ఏపీలో జరుగుతోంది.

    అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్ చిన్న కంపెనీ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల కిందటే... తొలి కారును రిలీజ్ చేసిన దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్... రూ.7387 కోట్ల విలువైన ప్లాంట్‌ని ఏపీలో నడుపుతోంది. ఈ ప్లాంటును రెండేళ్ల పాటూ నిర్మించిన తర్వాత... గత డిసెంబర్‌లో కియా మోటార్స్... దీన్ని ప్రారంభించింది. ఈ ప్లాంట్‌కి ఏటా 300000 లక్షల కార్లను తయారుచేసే సత్తా ఉంది. అలాగే... 12000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోవడానికి వీల్లేదని అనంతపురం వాసులు కోరుతున్నా్రు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు