Home /News /andhra-pradesh /

TAMARIND NUTS BUSINESS GETTING PROFITS IN ANDHRA PRADESH AS IT HAS MANY BENEFITS FULL DETAILS HERE PRN

Tamarind Nuts: చింతగింజలకు కాసులు రాలుతున్నాయ్..! ఏడాదికి కోట్లలో బిజినెస్.. మీరూ ఓ లుక్కేయండి..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Tamarind seeds: ఎందుకు పనికిరావని మనం తీసిపడేసే గింజలతో లక్షలు సంపాదించొచ్చని మీకు తెలుసా..? ఈ చింతగింజలతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలకైతే ఇప్పుడు ఈ చింతగింజలే ముడిసరుకుగా మారింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ కామర్స్‌ సైట్‌లలోనూ ఈ చింతగింజలకు భారీ డిమాండ్‌ ఉంది.

ఇంకా చదవండి ...
    మనం నిత్యం వాడే పదార్ధం చింతపండు (Tamarind). అందులో ఎందుకు పనికిరావని మనం తీసిపడేసే గింజలతో లక్షలు సంపాదించొచ్చని మీకు తెలుసా..? ఈ చింతగింజలతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశ్రమలకైతే ఇప్పుడు ఈ చింతగింజలే ముడిసరుకుగా మారింది. అమెజాన్‌ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లాంటి ఈ కామర్స్‌ సైట్‌లలోనూ ఈ చింతగింజలకు భారీ డిమాండ్‌ ఉంది. ఇంతకీ అసలింతకీ ఈ చింతగింజల్లో అంత విషయం ఏముంది? ప్రస్తుతం చింత గింజలూ వ్యాపార్థస్తులకు మంచి గిరాకీ తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలుతో పాటు పలు ప్రాంతాల్లో చింత గింజల ప్రాసెసింగ్‌ యూనిట్లు మొదలయ్యాయి. వ్యాపారుల నుంచి చింత గింజలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ యూనిట్లకు తరలిస్తుంటారు. అక్కడ వాటిని ప్రాసెసింగ్‌ చేసి…పలు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు.

    మూడు జిల్లాలో ప్రాసెసింగ్‌యూనిట్లు:
    రాష్ట్రంలో అన్ని అటవీ ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, హిందూపురం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో చింత గింజలు దొరుకుతున్నాయి. అయితే విజయనగరం, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో చింత గింజల్ని ప్రాసెసింగ్‌ చేసే యూనిట్లు ఉన్నాయి.

    ఇది చదవండి: ఏపీలో కొత్తగా 3530 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలివే..!


    మన రాష్ట్రం నుంచి ఏటా 18 వేల టన్నుల చింత గింజలు ఎగుమతి అవుతుండగా.. వాటి విలువ రూ.36 కోట్ల పైమాటే. చింతగింజల కొనుగోళ్లు, ఎగుమతుల ద్వారా ఏడాదికి సుమారు రూ.65 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచాం. ఒక్క కాకినాడ జిల్లాలోనే రోజుకు దాదాపు 60 టన్నుల వరకు చింత గింజలు లభ్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందులో 20 టన్నుల వరకు ప్రాసెసింగ్‌ జరుగుతోంది. చింతపండు సీజనల్‌గా మాత్రమే లభిస్తుంటాయి. అయితే కోల్డ్‌ స్టోరేజిలలో నిల్వ ఉంచడం వల్ల.. ఏడాదంతా చింత గింజలు అందుబాటులో ఉంటాయి. దీంతో చింత పిక్కలను ప్రాసెసింగ్‌ చేసే ఫ్యాక్టరీలు ఏడాదంతా రన్‌ అవుతూనే ఉంటాయి.

    ఇది చదవండి: ఏడారిలా గోదారి.. ఆ రెండు జిల్లాలకు భవిష్యత్తులో కష్టాలు తప్పవా..?


    చింతగింజలకు ధరకట్టి కొనుగోలు:
    చింతగింజలను ఊరకనే కాదండోయ్‌… కేజీల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో కేజీ రూ.5 నుంచి రూ.8కి కొంటున్నారు. అయితే ప్రాసెసింగ్‌ చేసిన తర్వాత అంటే తోలు తీసిన తరువాత వాటి విలువ పెరుగుతుంది.. అప్పుడు కేజీ రూ.20కి పైగా అమ్ముతారు. చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్లలో పనిచేసే కార్మికుల సంఖ్య వెయ్యికి పైగా ఉంటుంది. అంతేకాదు యూనిట్‌లతో సంబంధం లేకుండా… చింతపండు గింజలు తీసే కుటుంబాలు రాష్ట్రంలో 10 వేలకు పైగా ఉన్నాయి. లెక్కప్రకారం ఐదు కేజీల చింతపండుకు అటుఇటుగా కేజీ గింజలు వస్తాయి.

    ఇది చదవండి: ఏపీలో ఇక సినిమా చూడటం కష్టమేనా..? ఎంఓయూపై థియేటర్ల అభ్యంతరం..!


    ప్రాసెసింట్‌ యూనిట్‌ పనితీరు:
    చింతపండు నుంచి వేరు చేసిన గింజలను చింతపండు వ్యాపారులు ఫ్యాక్టరీలకు విక్రయిస్తారు. వాటిని ప్రాసెసింగ్‌ యూనిట్లలోని బాయిలర్‌లో (240 డిగ్రీల వేడి వద్ద) నీటితో శుభ్రం చేస్తారు. అనంతరం దానిపై ఉండే తొక్కను తీసి ప్యాక్‌చేస్తారు. వాటిని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్తారు.

    ఇది చదవండి: తెలుగోడి పంచ్‌ పవరే వేరప్పా..! బాక్సింగ్‌లో మిర్చిలాంటి కుర్రాడు..!


    విదేశాలకు చింతగింజల పౌడర్‌ :
    రాష్ట్రంలోని హిందూపురంలో చింత గింజల పౌడర్‌ తయారు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాక్టరీలలో ఈ గింజలను వైట్‌ పౌడర్‌గా మార్చి.. ఏ1, ఏ2, ఏ3, ఏ4 గ్రేడ్‌లుగా విభజించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చింత గింజల పౌడర్‌ ధర చింతపండు కన్నా చాలా కాస్ట్‌లీ ..సుమారు కేజీ పౌడర్‌ ధర రూ.400 వరకు ఉంటుంది అంచనా.

    ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


    చింతపండు గింజలతో ప్రయోజనాలెన్నో..!
    మోకాళ్ల నొప్పులకు చింత గింజలు ఔషధంలా పనిచేస్తాయని చెబుతుంటారు. అంతే కాదు మరికొన్ని రకాల మందుల తయారీలోనూ ఈ చింతగింజలను వాడుతారు. మస్కిటో కాయిల్స్‌ తయారీలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు. పట్టు వస్త్రాలు, జూట్‌ పరిశ్రమలోనూ ఈ చింతగింజలను వాడుతుంటారు. చింత గింజల్లో ఫైబర్, ప్రొటీన్స్, మినరల్స్‌ ఉండటంతో కొందరు వంటకాల్లోనూ వినియోగిస్తారు.



    ప్రాసెసింగ్ యూనిట్ ల సంఖ్య పెరిగితే మరింత ఆదాయం
    కొందరు వ్యాపారులు ఆన్‌లైన్‌ వ్యాపారంలోనూ అడుగుపెట్టారు. సేకరించిన చింతగింజలను , ప్రాసెస్‌ చేసిన చింతగింజలను ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముతున్నారు. కొందరు పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఫోన్‌ చేసి పెద్ద మొత్తంలో ఆర్డర్‌లు ఇస్తుంటారని తూర్పుగోదావరి జిల్లా వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రాసెసింగ్‌ యూనిట్ల సంఖ్య పెరిగితే ఈ వ్యాపారం ఇంకాస్త ఊపందుకుంటుదని..కార్మికులకు ఆదాయం వస్తుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు