పెళ్లిళ్ల అనుమతికి అది తప్పనిసరి... ఏపీ ప్రభుత్వం నిర్ణయం

వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: July 17, 2020, 10:02 PM IST
పెళ్లిళ్ల అనుమతికి అది తప్పనిసరి... ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వైపు కరోనా కల్లోలం. మరోవైపు రానున్న మంచి రోజుల శ్రావణ మాసం. దీంతో తమ ఇంట్లో పెళ్లి వంటి శుభకార్యం చేయాలనుకునే వారి పరిస్థితి డైలమాలో పడిపోయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పెళ్లిళ్లకు అతిధులు ఆశించిన స్థాయిలో వచ్చేది కూడా అనుమానమే. ఇదే సమయంలో అసలు పెళ్లిళ్లకు ఎంతమంది అతిథులను అనుమతించాలనే అంశంపై ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ కార్యక్రమాలకు అనుమతి జిల్లా కలెక్టరేట్‌ నుంచి పొందాల్సి వచ్చేది. దీనివల్ల జాప్యం అవుతోంది. దీంతో మండల పరిధిలో తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈనెల 21వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించుకోవడానికి బంధువులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ కింది స్థాయిలోనే పెళ్లిళ్లకు అనుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. మిగతా శుభకార్యాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం కేవలం 20 మందికి మాత్రమే తహసీల్దార్‌ అనుమతి ఇవ్వనున్నారు.పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడికి సంబంధించి ఇరువైపులా కలిపి ఈ సంఖ్యను మాత్రమే అనుమతించనున్నారు.

వివాహ ఆహ్వాన పత్రికతోపాటు అనుమతి కోరేవారు రూ.10 నాన్‌ జ్యుడీషియల్‌స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకునేవారు తమ ఆధార్‌ కార్డులతోపాటు కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు ఇచ్చినపత్రాలను జత చేయాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని సెక్షన్‌–188 ద్వారా కఠిన చర్యలు తీసుకోనున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 17, 2020, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading