జగనన్న పాటకు ఎమ్మార్వో డ్యాన్స్.. షాకిచ్చిన పైఅధికారులు..

ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన తహసీల్దారుకు పైఅధికారులు షాక్ ఇచ్చారు.

news18-telugu
Updated: November 21, 2019, 7:08 AM IST
జగనన్న పాటకు ఎమ్మార్వో డ్యాన్స్.. షాకిచ్చిన పైఅధికారులు..
జగనన్న పాటకు ఎమ్మార్వో డ్యాన్స్
  • Share this:
ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన తహసీల్దారుకు పైఅధికారులు షాక్ ఇచ్చారు. శ్రీకాకులం జిల్లా భామిని మండలంలో ఎమ్మార్వోగా పనిచేస్తున్న అధికారి వైసీపీకి చెందిన కార్తీక మాస వన భోజనాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్కడ జగనన్న పాటకు కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ తతంగాన్ని అక్కడివాళ్లలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడిాయాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా.. జగనన్న పాటకు డ్యాన్స్ చేయడంపై స్పందించాలని ఆదేశించారు.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading