హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అమరావతిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఆ మహిళా ఎమ్మెల్యేకి చెక్ పడినట్లేనా..? డొక్కా నియామకం దేనికి సంకేతం..!

అమరావతిలో అర్ధరాత్రి హైడ్రామా.. ఆ మహిళా ఎమ్మెల్యేకి చెక్ పడినట్లేనా..? డొక్కా నియామకం దేనికి సంకేతం..!

ఉండవల్లి శ్రీదేవి

ఉండవల్లి శ్రీదేవి

వైఎస్సార్‌సీపీ (YSRCP)లో ఉన్న ఆ మహిళా ఎమ్మెల్యే (MLA)కు అధిష్టానం చెక్ పెట్టనుందా..? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమనే అనిపిస్తోంది. జగన్ క్యాబినెట్‌లో మంత్రి ప్లేస్ ఫిక్స్ అనే స్థాయి నుంచి రేపు సీటు ఉంటుందో పోతుందో తెలియని స్థితికి ఆమె పరిస్థితి దిగజారింది. ఇంతకీ ఆ మహిళ ఎమ్మెల్యే ఎవరు..? అమరావతి (Amaravati)లో అర్ధరాత్రి ఆ హైడ్రామా ఏంటో ఒకసారి చూద్దాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  వైఎస్సార్‌సీపీ (YSRCP)లో ఉన్న ఆ మహిళా ఎమ్మెల్యే (MLA)కు అధిష్టానం చెక్ పెట్టనుందా..? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అది నిజమనే అనిపిస్తోంది. జగన్ క్యాబినెట్‌లో మంత్రి ప్లేస్ ఫిక్స్ అనే స్థాయి నుంచి రేపు సీటు ఉంటుందో పోతుందో తెలియని స్థితికి ఆమె పరిస్థితి దిగజారింది. ఇంతకీ ఆ మహిళ ఎమ్మెల్యే ఎవరు..? అమరావతి (Amaravati)లో అర్ధరాత్రి ఆ హైడ్రామా ఏంటో ఒకసారి చూద్దాం.

  గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు తెలియని వారుండరు. అసెంబ్లీలో జగన్‌పై ఎమోషనల్ స్పీచ్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ఆమె పేరు ఫీడ్ చేసుకున్న ఉండవల్లి శ్రీదేవికి.. ఇప్పుడు పార్టీలో గడ్డుకాలమే నడుస్తుందని చెప్పొచ్చు. ఆమెకు కనీసం సమాచారం ఇవ్వకుండానే.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఆమె నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమించడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తన నియోజకవర్గానికి డొక్కాని నియమించడం ఏంటని ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే శ్రీదేవి శుక్రవారం అర్ధరాత్రి పార్టీ అనుచరులతో కలిసి పార్టీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసన చేపట్టారు.

  ఇదీ చదవండి: 'యూనివర్సిటీలో మా అడ్డా క్యాంటీనే'.. ఏఎన్‌యూలో ఆ రోజులను గుర్తు చేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

  ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ నియామకంతో ఎమ్మెల్యేను అవమానించారంటూ శ్రీదేవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మాజీ మంత్రి మేకతోటి సుచరిత పార్టీ అధిష్టానంతో మాట్లాడుదామంటూ నచ్చజెప్పడంతో శ్రేదేవి నిరస విరమించారు. పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.

  మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారు. టీడీపీ నుంచి వచ్చిన మాణిక్య వరప్రసాద్‌కు మూడు పదవులు దక్కినట్లయింది. తొలుత ఎమ్మెల్సీగా.. ఆ తర్వాత పార్టీ విప్‌గా, ఇప్పుడు తాడికొండ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాడికొండ సీటు ఎమ్మెల్యే శ్రీదేవికి దక్కనుందా..? లేక డొక్కా మాణిక్య వరప్రసాద్ హస్తగతం అవుతుందో వేచి చూడాల్సిందే..!

  ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే అన్నీ పార్టీలు సర్దుబాటు చర్యలు.. దిద్దుబాటు చర్యల్లో పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఒక ప్రణాళికతో వెళ్తుంటే.. సీఎం జగన్ టార్గెట్ 175 లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఓటు శాతం పెంచుకునేందుకు బహిరంగ సభలతో దూసుకుపోతున్నారు.

  First published:

  Tags: Vundavalli sridevi

  ఉత్తమ కథలు