సంక్రాంతి పండగ (Sankranti Festival) వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విషాదం నెలకొంది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు స్పాట్లోనే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన తాడేపల్లి గూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖపట్టణం (Visakhapattnam)జిల్లా దువ్వాత నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం నారాయణపురానికి చేపల లోడుతో వెళ్తున్న లారీ.. తాడేపల్లిగూడెం కొండ్రుప్రోలు NH-216 వద్దకు రాగానే అదుపు తప్పింది. క్షణాల్లోనే రోడ్డుపై పడిపోయింది. లారీలో ఉన్న నలుగురు కూలీలు మరణించారు. వారంతా బీహార్‌కు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం (Tadepalligudem Road Accident) అనంతరం లారీలో ఉన్న చేపల బాక్స్‌లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోవడంతో.. కొందరు స్థానికులు వాటిని పట్టుకెళ్లారు. పోలీసులు వెళ్లిన తర్వాత వారిన అక్కడి నుంచి పంపించివేశారు. రోడ్డుపై ఉన్న బాక్స్‌లను మళ్లీ లారీలో పెట్టారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లారీ నెంబర్, మృతుల వద్ద ఉన్న ఫోన్ల ఆధారంగా చేపల యజమానికి సమాచారం ఇచ్చారు. బీహార్‌లో ఉన్న బంధువులకు కూడా ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరించారు. తమ వారు చనిపోయారని తెలిసి మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బీహార్ నుంచి ఏపీకి బయలుదేరారు. సంక్రాంతి పండగ రోజే రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.