Sye Raa | మెగాస్టార్‌ చిరంజీవిపై 30 ఇయర్స్ పృథ్వీ పొగడ్తల సునామీనే...

Sye Raa Pre release function | వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీగా సుపరిచితుడైన పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవి మీద పొగడ్తల జల్లు కురిపించారు. దాన్ని జల్లు అనడం కంటే సునామీ అనాల్సిందే.

news18-telugu
Updated: September 23, 2019, 9:57 AM IST
Sye Raa | మెగాస్టార్‌ చిరంజీవిపై 30 ఇయర్స్ పృథ్వీ పొగడ్తల సునామీనే...
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలిజ్ ఫంక్షన్‌లో మాట్లాడుతున్న 30 ఇయర్స్ పృథ్వీ
news18-telugu
Updated: September 23, 2019, 9:57 AM IST
వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీగా సుపరిచితుడైన పృథ్వీరాజ్ మెగాస్టార్ చిరంజీవి మీద పొగడ్తల జల్లు కురిపించారు. దాన్ని జల్లు అనడం కంటే సునామీ అనాల్సిందే. ఆ రేంజ్‌లో పొగిడారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలు హాజరయ్యారు. ఈ వేదిక మీద 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నాది మాధవయ్యర్ పాత్ర. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను (చిరంజీవి) కలిస్తే.. ఈ క్యారెక్టర్ ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికి వస్తుందిరా. నీకు దక్కింది. డూ ఇట్. డూ యువర్ బెస్ట్ అని ప్రోత్సహించారు. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా చిరంజీవి రుణం తీరదు. ఈ అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాం. నాకు ఇది ఆస్కార్ అవార్డుతో సమానం. ఈ సినిమాలో అన్నయ్య గొప్పదనం గురించి చెప్పే అద్భుత క్యారెక్టర్ నాతో చేయించారు. ఈ క్యారెక్టర్ నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. జీవితంలో ఈ క్యారెక్టర్ ఒక్కటే చాలు. ఇంకా చేయకపోయినా ఫర్వాలేదు. ఆ తిరుమల వెంకన్న ఆశీస్సులు మెగాస్టార్‌కి ఉండాలి. అన్ని భాషల్లోనూ సైరా సినిమా రికార్డులు బద్దలు కొట్టాలి.’ అని అన్నాడు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...