సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్...

ఈనెల 14న చిరంజీవి.. అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు తెలిసింది.

news18-telugu
Updated: October 11, 2019, 2:06 PM IST
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్...
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యే తేదీ ఖరారైంది. ఈనెల 14న చిరంజీవి.. అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ మేరకు అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు తెలిసింది. మొదట ఈనెల 11న ఉదయం 11 గంటలకు జగన్‌‌ను కలుస్తారంటూ తొలుత ప్రచారం జరిగింది. అయితే, ఆ అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదంటూ సీఎంఓ తేల్చిచెప్పింది. అయితే, తాజాగా 14వ తేదీన ఖరారైనట్టు తెలిసింది. సైరా నరసింహారెడ్డి సినిమా విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి చరితను తెరకెక్కించిన విధానాన్ని వివరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కూడా కలిశారు. ఆమె కూడా సినిమాను చూసి మెగాస్టార్‌ను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే, ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు