అదంతా ఫేక్ స్యూస్.. చిరంజీవికి ఖరారుకాని జగన్ అపాయింట్‌మెంట్

Chiranjeevi meeting YS jagan | ఈనెల 11న ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: October 10, 2019, 4:45 PM IST
అదంతా ఫేక్ స్యూస్.. చిరంజీవికి ఖరారుకాని జగన్ అపాయింట్‌మెంట్
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెగస్టార్ చిరంజీవి కలవబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈనెల 11న ఉదయం 11 గంటలకు అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. జగన్‌ను కలిసేందుకు చిరంజీవికి సీఎంఓ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే, సీఎంఓ నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదని తెలిసింది. చిరంజీవికి అపాయింట్‌మెంట్‌పై సీఎంఓలోని ఒకరు న్యూస్‌18కి ఈ విషయాన్ని తెలియజేశారు. ‘చిరంజీవికి అమరావతిలో సీఎంఓ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదు.’ అని సీఎంఓలో ఓ అధికారి తెలిపారు. న్యూస్‌ 18కి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 14న చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

సైరా నరసింహారెడ్డి సినిమా విజయం సాధించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా పలువురు రాజకీయ ప్రముఖులను కలుస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడి చరితను తెరకెక్కించిన విధానాన్ని వివరిస్తున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కూడా కలిశారు. ఆమె కూడా సినిమాను చూసి మెగాస్టార్‌ను మెచ్చుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూడా కలవడానికి అపాయింట్‌మెంట్ కోరినట్టు తెలిసింది. అయితే, ఇంకా అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు.

Video పామును  నూడుల్స్‌లా మింగేసిన కప్ప



First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>