Home /News /andhra-pradesh /

SYE RAA AND YATRA WILL BE FRONT RUNNERS FOR NANDI AWARDS IF AP GOVERNMENT ANNOUNCE NANDI AWARDS FOR 2019 AK

జగన్ నిర్ణయం... యాత్ర, సైరాకు అవార్డులు ఖాయమా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

తాము అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి కొత్తగా నంది అవార్డులు ప్రకటించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

    టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు చేయూత అందించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగానే స్పందించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్... నంది అవార్డుల వేడుక కూడా చేపడతామని హామీ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రకటించిన నంది అవార్డుల వాటిని పక్కనపెట్టి... గతేడాదిని ప్రాతిపదికగా తీసుకుని వైసీపీ ప్రభుత్వం కొత్తగా నంది అవార్డులను ప్రకటిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    తాము అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి కొత్తగా నంది అవార్డులు ప్రకటించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం తెలుగు సినిమాలకు సంబంధించి నంది అవార్డులను ప్రకటిస్తే... ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడి అవార్డ్ ఎవరికి దక్కుతుందనే అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. 2019లో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అనేక సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడి అవార్డ్ అందుకునే స్థాయిలో ఉన్న సినిమాల జాబితాలో రెండు చిత్రాలు ముందున్నాయనే వాదన వినిపిస్తోంది. అందులో ఒకటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా కాగా, మరొకటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా చిరంజీవి నటించి నిర్మించిన సైరా సినిమా.

    Nandi awards 2019, ys jagan government to give nandi awards, yatra, sye raa, chiranjeevi, mammotty, ap latest news, నంది అవార్డులు 2019, నంది అవార్డులు ఇవ్వనున్న సీఎం జగన్ ప్రభుత్వం, సైరా, చిరంజీవి, మమ్ముట్టి, ఏపీ తాజా వార్తలు
    ప్రతీకాత్మక చిత్రం


    ఒకవేళ 2019 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటిస్తే ఈ రెండు సినిమాలకు కచ్చితంగా అవార్డులు వస్తాయని... యాత్రలో నటించిన మమ్ముట్టికి ఉత్తమ నటుడి అవార్డు, చిరంజీవి నటించిన సైరా సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయనే పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వివాదాల కారణంగా గతంలో ప్రకటించిన అవార్డులనే ప్రభుత్వాలు ఇవ్వలేకపోయాయని... కాబట్టి వైసీపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి వేడుకలను నిర్వహిస్తుందా అన్న అంశంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nandi Awards, Sye raa, Yatra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు