సీఎం జగన్ స్పందించాలి... తిరుమల బస్సు టికెట్ల వివాదంపై స్వరూపానందేంద్ర

తిరుమల బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరగడాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఖండించారు.

news18-telugu
Updated: August 23, 2019, 3:41 PM IST
సీఎం జగన్ స్పందించాలి... తిరుమల బస్సు టికెట్ల వివాదంపై స్వరూపానందేంద్ర
సీఎం జగన్‌తో స్వరూపానంద (ఫైల్ ఫోటో)
  • Share this:
తిరుమలకు వెళ్లే బస్సుల్లోని టికెట్లపై అన్యమత ప్రచారం జరగడం దుర్మార్గమైన చర్య అని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వ్యాఖ్యానించారు. ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్న వాళ్లు ఎవరు... దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటనే విషయంపై విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్ష్ణ చేసిన, కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సీఎం స్పందించాలని ఆయన కోరారు. తిరుమలలో ఇటువంటి పరిణామాల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల చుట్టూ అన్యమత ప్రచారం చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. వీటిని సమీక్షించి వెంటనే సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని పత్రిక ప్రకటనలో వెల్లడించారు స్వరూపానందేంద్ర.
Published by: Kishore Akkaladevi
First published: August 23, 2019, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading