రమేష్ ఆస్పత్రి అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్.. ప్రత్యేక బృందాల తనిఖీలు

రమేష్ ఆస్పత్రి నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకుంటోందని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. అంతేకాదు కోవిడ్ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తోందని చెప్పారు.

news18-telugu
Updated: August 10, 2020, 5:27 PM IST
రమేష్ ఆస్పత్రి అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్.. ప్రత్యేక బృందాల తనిఖీలు
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
  • Share this:
స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దర్యాప్తులో భాగంగా చర్యలను ముమ్మరం చేసింది. సోమవారం రమేష్ ఆస్పత్రిలో మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. పలు కీలక పత్రాలతో పాటు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. రమేష్ ఆస్పత్రి నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది పేషెంట్లను చేర్చుకుంటోందని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. అంతేకాదు కోవిడ్ బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తోందని చెప్పారు. మరో మూడు బ్రాంచ్ ఆస్పత్రుల్లోనూ తనిఖీలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

హోటల్ స్వర్ణప్యాలెస్‌ను రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తోంది. ఈ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు అలుముకోవడంతో కరోనా బాధితులు అల్లాడిపోయారు. ఊపిరాడక అకడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలవడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. 48 గంటల్లో దీనిపై నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 5:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading