ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద కన్నుమూత

ప్రబోధానంద(ఫైల్ ఫోటో)

గతంలో హిందూ, ముస్లిం దేవుళ్లపై ప్రబోధానం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

  • Share this:
    అనంతపురం జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు ప్రబోధానంద కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆత్మజ్ఞానం పేరుతో అనేక ప్రబోధానంద అనేక రచనలు చేశారు. గతంలో హిందూ, ముస్లిం దేవుళ్లపై ప్రబోధానం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇక రెండేళ్ల క్రితం జేసీ వర్గీయులు, ప్రబోధానంద శిష్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కారణంగా ఆయన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు.

    ఇక ప్రబోధానంద అంత్యక్రియలు రేపు తాడిపత్రి సమీపంలోని ప్రబోధానంద ఆశ్రమంలో జరగనున్నాయి. ఇక చనిపోయే ముందే ప్రబోధానంద తన ఆశ్రమంలో సమాధి కట్టించుకున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: