వెంకన్న మీద ఒట్టు.. ఆ ఆడియో నాది కాదంటున్న పృథ్వీ

వెంకన్న మీద ఒట్టు.. ఆ ఆడియో నాది కాదంటున్న పృథ్వీ

కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ

తాను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిలో ఉండడం చాలా మందికి ఇష్టం లేదని.. ఈ క్రమంలోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆడియ్ టేప్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. తప్పని తేలిదే ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తానని చెప్పారు పృథ్వీ.

 • Last Updated:
 • Share this:
  ఆడియో టేప్ వ్యవహారంపై ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీ ఎట్టకేలకు స్పందించారు. తాను ఏ మహిళతోనూ మాట్లాడలేదని.. ఆ ఆడియో టేప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని చెప్పారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని.. ఆ విషయాన్ని ఎస్వీబీసీలో ఉన్న ఏ ఉద్యోగిని అడిగినా చెబుతారని చెప్పుకొచ్చారు. తిరుపతి వెంకటేశ్వురుడి మీద ఒట్టేసి చెబుతున్నా.. తాను ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. తాను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిలో ఉండడం చాలా మందికి ఇష్టం లేదని.. ఈ క్రమంలోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆడియో టేప్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని.. తప్పని తేలిదే ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తానని చెప్పారు పృథ్వీ.

  ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  అగ్ర కథనాలు