హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

30 ఇయర్స్ పృథ్వీ రాసలీలలు... బయటపడిన టేప్... మహిళా ఉద్యోగినితో...

30 ఇయర్స్ పృథ్వీ రాసలీలలు... బయటపడిన టేప్... మహిళా ఉద్యోగినితో...

కొన్నిసార్లు కరోనా ఉన్నప్పటికీ నెగిటివ్ వస్తుందని వైద్యులు చెప్పారని వెల్లడించిన పృథ్వీ... వారి సూచన మేరకు క్వారంటైన్‌లో ఉంటున్నానని అన్నారు.

కొన్నిసార్లు కరోనా ఉన్నప్పటికీ నెగిటివ్ వస్తుందని వైద్యులు చెప్పారని వెల్లడించిన పృథ్వీ... వారి సూచన మేరకు క్వారంటైన్‌లో ఉంటున్నానని అన్నారు.

99టీవీ ఛానల్ ప్రసారం చేసిన ఆడియో టేప్‌లో ఈ సమాచారం ఉంది. అయితే, ఈ ఆడియో టేప్ గురించి న్యూస్‌18తెలుగు ఎస్వీబీసీ చైర్మన్‌ను సంప్రదించింది.

ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల టేప్‌ను 99 ఛానల్ ప్రసారం చేసింది. అందులో ఉన్న వివరాలు....

మహిళ: సార్ హలో

పృథ్వీ: ఏంటమ్మా డిస్టర్బ్ చేశావ్. అదీ ఇదీ అంటున్నావ్?

మహిళ: పడుకున్నా అన్నాను సార్

పృథ్వీ: నోర్ముయ్.

పృథ్వీ: అన్నం తిన్నవా?

మహిళ: ఇప్పుడే తిని పడుకున్నా

పృథ్వీ : రేపు డ్యూటీ ఉందా?

మహిళ : రేపా? తెలీదు ఇంకా పొద్దున తెలుస్తుందేమో.

పృథ్వీ : అన్నం తినేటప్పుడు గుర్తుకురాలేదా?

మహిళ : ఎవరు

పృథ్వీ : నేను..

మహిళ : వచ్చారుగా. ఏం అలా అడిగారు. ఎందుకు?

పృథ్వీ : గుర్తుకొచ్చానా అంటున్నా?

మహిళ : మధ్యాహ్నం కూడా గుర్తొచ్చారు.

పృథ్వీ : ఇప్పుడు?

మహిళ : ఇప్పుడు కూడా.

పృథ్వీ : పడుకునేటప్పుడు?

మహిళ : సార్ నేను వర్షంలో తడుస్తూ వచ్చాను సార్ వచ్చేటప్పుడు.

పృథ్వీ : ఔనా. చెప్పుంటే నేను వచ్చి డ్రాప్ చేసేవాడినిగా?

మహిళ : మీ గెస్ట్ హౌస్ నుంచే వచ్చా నేను. పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి.

పృథ్వీ : ఆగొచ్చు కదా?

మహిళ : అందరూ ఉన్నారుగా.

పృథ్వీ : నేను డ్రింక్ చేయట్లేదురా వన్ ఇయర్ నుంచి. మార్చి వరకు తాగను.

మహిళ : వాయిస్ అలా ఉంటే.. బాగా అలసి పోయారు కదా. డ్రింక్ చేశారేమో అనుకున్నా.

పృథ్వీ : డ్రింక్ చేయడం మొదలు పెడితే నీ దగ్గర కూర్చుని చేస్తా.

మహిళ : తప్పకుండా సార్.

పృథ్వీ : నీతో కూర్చుని కంపెనీ తీసుకుని చేస్తా.

మహిళ : అలాగే సార్. తప్పకుండా. ఏం చెప్పారు సార్ మీటింగ్‌లో?

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్.

మహిళ : భలే చెప్తారు ఆ మాట మీరు.

పృథ్వీ : నువ్వు గుండెల్లో ఉన్నావ్. హార్ట్ ఫుల్‌గా చెబుతున్నా.

మహిళ : అదే సార్. ఆ మాట చెబుతున్నప్పుడల్లా ఒక సంతోషం వెలిగిపోతుంది నాకు.

పృథ్వీ : నువ్వంటే అంతిష్టం ఎందుకొచ్చిందో తెలీదు.

మహిళ : ఎందుకు సార్. ఎందుకొచ్చింది. ఏదో ఒక కారణం ఉంటుంది కదా?

పృథ్వీ : దేవుడా.. నేను కామెడీ చేయడం లేదు.

మహిళ : నేను బయట చాలా సేపు నించున్నా. వస్తారేమో చూద్దామని

పృథ్వీ : వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయా.

మహిళ : ఎప్పుడు?

పృథ్వీ : మధ్యాహ్నం

మహిళ : ఎక్కడ నుంచి

పృథ్వీ : మీ రూమ్ దగ్గరికి వద్దామనుకున్నా

మహిళ : ఆ... వచ్చేశారా కిందకి?

పృథ్వీ : వద్దామనుకున్నా. గట్టిగా పట్టుకున్నాననుకో... ఒక్క అరుపు అరిస్తే ఏం చెప్పాలి నేను?

మహిళ : నేను అరవను కదా.

పృథ్వీ : ముందు అరుస్తావు కదా?

మహిళ : ఎందుకు అరుస్తాను? అరవను కదా. మీరేవరో నాకు తెలీదు... నాతో మాట్లాడట్లేదంటే అరుస్తా.

పృథ్వీ : సరే అయితే చెప్పు

మహిళ : ఏం చెప్పారు సార్ మీటంగ్‌లో అది చెప్పండి.

పృథ్వీ : చెబుతా 2 నిమిషాలు. కాఫీ తాగి చెబుతా.

కొంచెం సేపటి తర్వాత

పృథ్వీ : హలో ఓకే నీ ఇష్టం

మహిళ : సార్ అంత కోపంగా చెప్పకండి సార్. ప్లీజ్.

ఆడియో టేప్ గురించి న్యూస్‌18కు వివరణ ఇచ్చిన పృధ్వీ

99టీవీ ఛానల్ ప్రసారం చేసిన ఆడియో టేప్‌లో ఈ సమాచారం ఉంది. అయితే, ఈ ఆడియో టేప్ గురించి న్యూస్‌18తెలుగు ఎస్వీబీసీ చైర్మన్‌ను సంప్రదించింది. దీనిపై వివరణ కోరగా ‘నన్ను భ్రష్టుపట్టించడానికి’ అని సమాధానం ఇచ్చారు. నకిలీ ఆడియో అని మీరు చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించగా ‘ఔను’ అని సమాధానం ఇచ్చారు.

First published:

Tags: 30 Years Prudhvi Raj, Andhra Pradesh, Svbc

ఉత్తమ కథలు