ఏపీ: జీవో నెంబర్ 1పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై నేడు విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) ఈ కేసు హైకోర్టులో ఉన్నందున జోక్యం చేసుకోలేమని పేర్కొంది. ఈ కేసును హైకోర్టు జస్టిస్ విచారణ జరపాలని ఆదేశించింది. దీనితో హైకోర్టు (High Court)లో ఈనెల 23న విచారణ జరగనుంది. మరి సోమవారం ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జీవోపై రాష్ట్రంలో రగడ..
రాష్ట్రంలో జగన్ సర్కార్ జనవరి 2న తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై రగడ ఇంకా కొనసాగుతుంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ కారణంగా సర్కార్ రోడ్లపై రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మేము రోడ్లపైకి రావొద్దని, ప్రజలను కలవొద్దనే ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చిందని టీడీపీ, జనసేన ఆరోపించింది. ఈ క్రమంలో జీవోను వ్యతిరేకిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు జీవో నెం.1ను ఇటీవల సస్పెండ్ చేసింది.
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్షాలను అడ్డుకోడానికి సర్కార్ ఈ జీవోను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవన్నీ రాజకీయ పరమైన వాదనలే అని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. సభలు, సమావేశాలను నిషేధించలేదని నిబంధనల మేర సమావేశాలు నిర్వహించుకోవాలని జీవోలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జీవో నెంబర్ 1 ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన సర్కార్ కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చిందనే చెప్పుకోవాలి. ఈ కేసుపై హైకోర్టు (High Court)లో అనుకూలంగా తీర్పు వస్తుందని ప్రభుత్వం భావించగా అలా జరగలేదు. పైగా తిరిగి మళ్లీ హైకోర్టులోనే విచారణ జరపాలని కోర్టు సూచించింది. 23న హైకోర్టు (High Court) విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, Ap cm jagan, AP High Court, AP News