HOME »NEWS »ANDHRA PRADESH »supreme court to hear plea seeking removal of andhra pradesh cm ys jagan mohan reddy nk

AP CM Jagan: సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని పిల్. నేడు సుప్రీంకోర్టులో విచారణ

AP CM Jagan: సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని పిల్. నేడు సుప్రీంకోర్టులో విచారణ
సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని పిల్. నేడు సుప్రీంకోర్టులో విచారణ

AP CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ... సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. నేడు సుప్రీంకోర్టు దాన్ని విచారించనుంది.

  • Share this:
    మంత్రులు, ముఖ్యమంత్రులపై కోర్టుల్లో అప్పుడప్పుడూ సంచలన పిటిషన్లూ, వ్యాజ్యాలూ దాఖలవుతుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రజాహిత వ్యాజ్యం (PIL) సుప్రీంకోర్టులో దాఖలైంది. దేశంలో రెండో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిపై జగన్ చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని... ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిల్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. అత్యున్నత న్యాయస్థానంలోని జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని బెంచ్... ఈ విచారణ జరపనుంది. ఈ సందర్భంగా... వైఎస్ జగన్... జస్టిస్ ఎన్వీ రమణ (Justic N V Ramana)కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) ఎస్ ఏ బాబ్డేకి ఎందుకు లేఖ రాశారో... సుప్రీంకోర్టు వివరణ కోరనుంది.

    పిల్ వేసిందెవరు?


    లాయర్లు GS మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్... ఈ పిల్ వేశారు. సీఎం జగన్ పై విదేశాలకు డబ్బు అక్రమ తరలింపు, అవినీతి సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయనీ... అవి చాలా తీవ్రమైన కేసులని వారు తెలిపారు.

    ఆధారాలు లేకుండా జగన్... ప్రజల ముందు, మీడియా ముందు... దేశంలోనే రెండో సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్ వీ రణమపై ఆరోపణలు చేశారని పిల్‌లో తెలిపారు. వెంటనే జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి... ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు.

    "కోర్టు నుంచి వ్యక్తిగత ప్రయోజనాలను పొందేందుకు... తన ముఖ్యమంత్రి పదవి అధికారాలను ఉపయోగించుకొని... అందరి ముందు ఓపెన్‌గా ఆసత్య ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు సిట్టిం జడ్జిగా ఉన్నవారిపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ఆయన ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థను మసకబార్చారు" అని పిల్‌లో అభిప్రాయపడ్డారు.



    ఇది కూడా చదవండి: Gold Silver Prices Today: 5 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు... నేటి రేట్లు ఇవీ

    CBI దర్యాప్తుకు డిమాండ్:
    సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జిలతో రాజ్యాంగబద్ధంగా ఓ అంతర్గత కమిటీ వేసి.. దానితో ఈ అంశంపై దర్యాప్తు జరిపించాలనీ, అలాగే సీబీఐతో కూడా దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ఎలా విచారిస్తుందన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:November 16, 2020, 08:08 IST

    टॉप स्टोरीज