SUPREME COURT KEY DIRECTIONS TO AP HIGH COURT ON TULLURU EX TAHASILDAR SUDHIR BABU CASE AK
AP High Court: ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టు
తుళ్లూరు భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్సుధీర్బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తుళ్లూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు కేసు విషయంలో ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో స్టే ఎత్తేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. వారంలోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. ఈ కేసులో వారంలోగా నిర్ణయం తీసుకోకపోతే తామే ఈ కేసును పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తుపై స్టే విధించొద్దని అనేక సార్లు చెబుతూనే వస్తున్నామని... చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తుళ్లూరు భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్సుధీర్బాబు సహా పలువురిపై సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక ఎస్సీ, ఎస్టీ రైతులను బెదిరించి మాజీ తహశీల్దార్అన్నే సుధీర్ బాబు, బ్రహ్మానంద రెడ్డి అసైన్డ్ భూములను లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమకు భూములు ఇవ్వకుంటే ల్యాండ్ పూలింగ్ లో భూములు పోగొట్టుకోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగినట్టు అభియోగాలు ఉన్నాయి.
ఇదే అంశంపై సుప్రీంకోర్టులో గత నెల రెండో వారంలోనూ విచారణ జరిగింది. సుధీర్ బాబుపై దర్యాప్తు చేయకుండా హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అయితే స్టే విధింపుపై జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రెండు వారాల్లోనే తదుపరి దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ చేయడానికి వీలులేని అస్సైన్డ్ భూములను బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి తహసీల్దార్ సుధీర్‌బాబు బదలాయించారని వాదించారు. భూకుంభకోణంలో తహసీల్దార్ పాత్ర ఉందని రోహత్గీ తెలిపారు. రాజధానికి ప్రభుత్వం ఈ భూములు తీసుకుంటే నష్టపరిహారం రాదని తప్పుడు మాటలు చెప్పారని.. ఈ క్రమంలో బ్రహ్మానందరెడ్డి, తహశీల్దార్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ కేసు విచారణను వారంలో పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.