నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇప్పటికే పలుమార్లు రమేష్ కుమార్ వ్యవహారంలో కోర్టు నుంచి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఆ తీర్పును అమలు చేయలేదు. దీంతో నిమ్మగడ్డ అంశంలో కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ను జగన్ ప్రభుత్వం అందుకోవాల్సి వచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఆ అంశంపై స్టే ఇచ్చేందుకు అంగీకరించలేదు.
పైగా కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ‘నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుకు సంబంధించి ప్రతి విషయం మా దృష్టికి వచ్చింది. మేం కావాలనే ఈ కేసులో స్టే ఇవ్వకుండా నిరాకరించాం. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ లేఖ పంపినా రమేశ్ కుమార్‌కు తిరిగి పోస్టింగ్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయం’ అంటూ సీజేఐ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, High Court, Nimmagadda Ramesh Kumar