Ap Three Capitals Case | ఏపీలో రాజధాని రగడ ఇంకా కొనసాగుతుంది. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు ఉద్యమం చేపట్టారు. తమ ప్రభుత్వం 3 రాజధానుల అంశానికి కట్టుబడి ఉందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో 3 రాజధానుల అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక అప్డేట్స్ వచ్చింది. 3 రాజధానుల కేసుపై ఈనెల 7న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు (Suprme Court) ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం..
ఏపీ రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది. హైకోర్టు (High Court) తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధిల్లో పని చేయాలి. శాసన, పాలనా వ్యవస్థ అధికారంలోకి న్యాయవ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రాజధానిపై శివరామ కృష్ణన్ (Shivarama krishnan) కమిటీ నివేదిక, జిఎస్ రావు (Gs Rao) కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Bostan Consulting Group) నివేదిక, హైపవర్డ్ (High powerd) కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్యా రాజధానిని అమరావతిని కేంద్రికృతం చేయకుండా..వికేంద్రీకరణ చేయాలని నివేదికలు చెబుతున్నాయి. తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఒకే రాజధాని ఉండాలని, ఏపీ (Andhra Pradesh) విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు (Ap High Court) తీర్పుపై స్టే విధించాలని, రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సరికాదని ఆ పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది.
సుప్రీంలో ఇప్పటికే విచారణ..
మూడు రాజధానుల కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారించింది. రాజధాని అంశం, రాష్ట్ర విభజనపై దాఖలైన 35 పిటీషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారించింది. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను, అమరావతి అంశంపై దాఖలైన పిటీషన్లను వేర్వేరుగా విచారించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో విచారణ వాయిదా వేయగా ఫిబ్రవరి 7న ఈ కేసుపై మరోసారి విచారణ జరపనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, AP Three Capitals, Supreme Court