ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సమయంలో హైకోర్టు విభజన అంశంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం... పిటిషన్‌ను కొట్టేసింది.
తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా.. ఉమ్మడి హైకోర్టు విభజన మాత్రం నాలుగున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలె, రెండు రాష్ట్రాలకు హైకోర్టును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాడ్డాయి. రెండు హైకోర్టులకూ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం కూడా పూర్తయిపోయింది.
అయితే, హైకోర్టు విభజనపై ఏపీ హైకోర్టు న్యాయవాదలు సంఘం.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలో ఏర్పాటు చేస్తున్నహైకోర్టులో మౌలిక వసతుల కల్పన పూర్తయ్యే వరకు హైకోర్టు విభజనను వాయిదా వేయాలని న్యాయవాదులు తమ పిటిషన్‌లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు. హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు పూర్తి కాలేదని, అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే పిటిషనర్లు వాదనలతో అత్యున్నత ధర్మాసనం ఏకీభవించలేదు. జస్టిస్ ఏకే సిక్రీ, అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం.. ఈ సమయంలో హైకోర్టు విభజనలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్‌ను కొట్టేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, High Court, Supreme Court, Telangana