ఏపీ 3 రాజధానులు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ

నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. పలాన గడువులోపు విచారణ ముగించాలంటూ మేం ఆదేశించలేమని తెలిపింది.

news18-telugu
Updated: August 26, 2020, 12:17 PM IST
ఏపీ 3 రాజధానులు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ
నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. పలాన గడువులోపు విచారణ ముగించాలంటూ మేం ఆదేశించలేమని తెలిపింది.
  • Share this:
ఏపీ మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ రద్దు గెజిట్‌పై ఏపీ హైకోర్టు విధించిన స్టేటస్ కోను సవాల్ చేస్తూ ఏపీప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‍ కో ఉత్తర్వులు ఎత్తివేయాలని దాఖలు చేసిన ఆ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు విచారణ చేస్తున్నందున.. ఈ దశలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున మా వద్దకు రావడం సరికాదని స్పష్టంచేసింది. నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. పలాన గడువులోపు విచారణ ముగించాలంటూ మేం ఆదేశించలేమని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు జులై 31న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా గవర్నర్ ఆమోదించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది. హైకోర్టు కర్నూలుకు తరలివెళ్లనుంది. ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని భావించినప్పటికీ.. హైకోర్టు స్టేటస్ కో విధించడంతో వెనక్కి తగ్గంది ఏపీ సర్కార్. ఐతే ఆ స్టేటస్‌ కోను ఎత్తివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఇందులో ఇప్పుడే జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: August 26, 2020, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading