ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరిని సిఫార్సు చేసిన కొలీజియం...

కొలీజియం సిఫార్సులను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే ఏపీ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు జెకె. మహేశ్వరి బాధ్యతలు చేపడతారు. కాగా ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు.

news18-telugu
Updated: August 30, 2019, 8:44 PM IST
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ మహేశ్వరిని సిఫార్సు చేసిన కొలీజియం...
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు (వీకీపీడియా)
news18-telugu
Updated: August 30, 2019, 8:44 PM IST
ఏపీ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జెకె మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొలీజియం సిఫార్సులను కేంద్రప్రభుత్వం ఆమోదిస్తే ఏపీ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు జెకె. మహేశ్వరి బాధ్యతలు చేపడతారు. కాగా ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ ఉన్నారు. హైకోర్టు విభజన అనంతరం అమరావతిలో ఏర్పాటు చేసిన హైకోర్టులో పూర్తిస్థాయి చీఫ్ జస్టిస్ నియామకం కాలేదు. ఇదిలా ఉంటే జస్టిస్‌ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా విధుల్లో ఉన్నారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రపతి ఆమోదముద్రతో కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ వెలువరిస్తుంది. దీంతో నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...