హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

భువనేశ్వరికి అవమానం తట్టుకోలేక -చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ -శపథం నెరవేరుతుంది!

భువనేశ్వరికి అవమానం తట్టుకోలేక -చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్ -శపథం నెరవేరుతుంది!

చంద్రబాబుకు రజనీకాంత్ సంఘీభావం

చంద్రబాబుకు రజనీకాంత్ సంఘీభావం

చంద్రబాబు ఏడుపు చూసి పలు రాష్ట్రాల ప్రముఖులు ఆయనకు ఫోన్లు చేసి పరామర్శించారు. పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్.. చంద్రబాబుకు ఫోన్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, టీడీపీ నేత, నటి వాణి విశ్వనాథ్ తదితరులు బాబకు సంఘీభావం తెలిపారు..

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly) లో చోటుచేసుకున్న ఘటనలపై మూడోరోజైన ఆదివారం కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని కించపరుస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు దారుణమైన కామెంట్లు చేయడం, వాటిని అసెంబ్లీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించడం, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మీడియా ముందే బాబు బోరున విలపించడం, దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగడం తెలిసిందే. కాగా, టీవీల్లో చంద్రబాబు(Chandrababu) ఏడుపు చూసి పలు రాష్ట్రాల ప్రముఖులు ఆయనకు ఫోన్లు చేసి పరామర్శించారు. పార్టీలకు అతీతంగా నేతలు స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్.. చంద్రబాబుకు ఫోన్ చేశారు.

ఏపీ అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు మాట్లాడిన తీరుకు నొచ్చుకుని, బాధతో విలపించిన టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్‌ చంద్రబాబుకు ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేశారు. గతం మరిచి ముందుకు సాగాల్సిందిగా రజనీ హితబోధ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జయలలిత స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ నేతలు సైతం చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్‌ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరిపై అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేశారని విని బాధపడ్డాను. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడాను’ అని అన్నా డీఎంకే నేత మైత్రేయన్‌ ట్వీట్‌ చేశారు.

Kaikala Satyanarayana : మరింత విషమించిన కైకాల ఆరోగ్యం -పని చేయని అవయవాలు -డాక్టర్లు ఏమన్నారంటే


ఒకప్పుడు టీడీపీ కంచు కంఠంగా, ‘మీసం లేని మగాడు’అని ఎన్టీఆర్ తో పొగడ్తలు అందుకున్న, ప్రస్తుత కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సైతం భువనేశ్వరి ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్, వైసీపీ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను అవమానించడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేయడం సభామర్యాదా? అని రేణుక ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రవర్తన మాత్రమే మిగిలుంటుందని, మహిళపై అసెంబ్లీ సాక్షిగా అసత్య ఆరోపణలు చేయడం తగదని రేణుక హితవు పలికారు.

నారా భువనేశ్వరిపై దారుణ కామెంట్లు.. స్పీకర్ తమ్మినేని చర్యలు -చంద్రబాబుకు కౌంటర్ -లోకేశ్ పుట్టుకపై..!!


టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తోన్న ప్రముఖ సినీనటి వాణీ విశ్వనాథ్‌.. చంద్రబాబుకు సంఘీభావం చెబుతూ.. ‘మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగపెడతా’అనే శపథం తప్పక నెరవేరుతుందని అన్నారు. భువనేశ్వరికి అసెంబ్లీలో జరిగిన అవమానం నేపథ్యంలోనే చంద్రబాబు శపథం చేశారని, నీచ రాజకీయాల కోసం కుటుంబీకులను, అందునా మహిళలను అవహేళన చేయడం బాధాకరమని వాణి అన్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Chandrababu Naidu, Nara Bhuvaneshwari, Rajnikanth, Renuka chowdhury, Vani Viswanath

ఉత్తమ కథలు