Home /News /andhra-pradesh /

SUMMER ARRANGEMENTS FOR ANIMALS IN DWARAKA TIRUMALA ANIMALS ENJOYING SHOWER BATH NGS

Animals Shower Bath: అనుభవించు రాజా.. అశ్వాలు, గజరాజులకు షవర్ బాత్.. ఎలా ఎంజాయ్ చేస్తున్నాయంటే?

మూగజీవాల షవర్ బాత్

మూగజీవాల షవర్ బాత్

Animals Shower Bath: రాజభోగం అంటే ఇదేనేమో.. వేసవి తాపాన్ని పోగడుతూ జనం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఆశ్రయిస్తుంటారు.. మరి మూగ జీవాల పరిస్థితి ఏంటి.. కానీ వీటిని చూడండి అనుభవించు రాజా అంటూ ఎంజాయ్ చేస్తున్నాయి. షవర్ బాత్ తో జలకాలాటలలో అంటూ పాటలు పాడుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
    Animals Shower Bath: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి (Summer Heat). భానుడి భగ భగలకు జనం అల్లాడి పోతున్నారు (Summer Effect). ఉదయం 9 గంటలు దాటింది అంటే రోడ్డు దాటి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇంట్లో ఉన్నా వేసవి తాపానికి ఏసీ, కూలర్, ఫ్యాన్ లాంటివి లేకపోతే అవస్థలు పడుతున్నారు. అత్యవసర పనిమీద బయటకు వెళ్లాలి అంటే మాడు పగిలిపోతోంది. వడదెబ్బ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అయితే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు ఇంటినుంచి బయటకు రావలడం లేదు. ఈ ఉష్ణోగ్రతలు (Temperatures) మనుషులకే కాక మూగజీవాలపైనా (Animals) ప్రభావం చూపుతున్నాయి. అందుకే వీటికి ఎండ వేడిని నుంచి కాపాడే చర్యలు చేపట్టింది ద్వారకా తిరుమల దేవస్థానం (Dwaraka Tirumala Devasthanam). ఏం చేసిందో చూడాలి.. ఇక గజరాజులు (Elephants), అశ్వాలు (Horse)ఎలా ఎంజాయ్ చేస్తున్నాయో చూడండి..

    దేవస్థానంలో ఉన్న మూగజీవాలు ఎండ వేడిని తట్టుకునే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై కొలువైన చిన వెంకన్న ఆలయ అధికారులు గో సంరక్షణ ట్రస్ట్ ద్వారా.. మూగజీవాల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. గో సంరక్షణ కేంద్రంలో వివిధ జాతుల ఆవులు, గిత్తలు, అదేవిధంగా స్వామివారి సేవకు వినియోగించేందుకు ఆలయ గజలక్ష్మి ఏనుగు, అశ్వాలను పోషిస్తున్నారు. ప్రస్తుతం అవన్ని వేసవి తాపానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. వాటి అవస్థలను గుర్తించిన అధికారులు.. వాటికి వేసవి తాపం తగలకుండా ఉండే విధంగా ప్రత్యేక షవర్లు ఏర్పాటు చేశారు.

    ఇదీ చదవండి : చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారా? కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందా..? మంత్రి కామెంట్

    ఆలయ గజలక్ష్మి అయితే గజరాజు.. హ్యాపీగా ఆ షవర్ల కింద స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. హాయిగా నృత్యం చేస్తూ సేద తీరుతుంది. ఆలయంలోని అశ్వాలు, ఆవులసైతం ఈ షవర్ బాత్ ను కొత్తగా ఫీల్ అవుతున్నాయి. బయట ఎండలు దంచికొడుతుండడంతో ఇలా షవర్ బాత్ తో మూగ జీవాలు పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి.

    ఇదీ చదవండి : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ..? పార్టీ ఏదీ.. పోటీ ఎక్కడ? ఆంధ్రా ఆక్టోపస్ క్లారిటీ

    మూగజీవాలు అధిక ఉష్ణోగ్రతల బారినపడకుండా దేవస్థానం అధికారులు చేపట్టిన చర్యలపై పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో.. అటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్ వెదర్‌లో సేదదీరుతున్న జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Animal Lovers, AP News, High temperature

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు