Home /News /andhra-pradesh /

SUJANA CHOWDARY FILES PETITION IN TELANGANA HIGH COURT REGARDING LOOKOUT NOTICE AK

Sujana Chowdary: ఎంపీ సుజనా చౌదరికి బిగ్ షాక్.. అమెరికా వెళ్లకుండా ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న అధికారులు

సుజనా చౌదరి( ఫైల్ ఫోటో)

సుజనా చౌదరి( ఫైల్ ఫోటో)

Sujana Chowdary: అమెరికాకు బయలుదేరిన సుజనా చౌదరిని ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాకు బయలుదేరిన సుజనా చౌదరిని ఎయిర్‌పోర్టులోనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంక్‌ కుంభకోణం కేసులో సుజనా చౌదరిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇమిగ్రేషన్‌ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో దీనిపై సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. లుక్‌ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

    బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేసినట్టు సుజనా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో ఆస్తుల వేలానికి నోటీసు ఇచ్చింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించి ఫెరారీ, బెంజ్ కార్లను స్వాధీనం చేసుకుంది. గతంలో సుజనా కార్యాలయాలపై సీబీఐ దాడులు కూడా నిర్వహించింది. హైకోర్టులో సుజనాపై మారిషస్‌ బ్యాంకులు పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే షెల్‌ కంపెనీల ద్వారా మనీ ల్యాండరింగ్‌ చేసినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Sujana Chowdary

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు