సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ భరోసా...

మంగళవారం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రీతి తల్లి ముఖ్యమంత్రిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు.


Updated: February 18, 2020, 11:32 PM IST
సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ భరోసా...
సుగాలి ప్రీతి తల్లితో సీఎం జగన్
  • Share this:
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ను సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తిచేశారు. కర్నూలులో కంటివెలుగు మూడోదశ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత సుగాలి ప్రీతి తల్లి పార్వతి సహా కుటుంబ సభ్యులు సీఎంను కలుసుకున్నారు. ఈకేసును సీబీఐకి రిఫర్‌ చేస్తున్నామని సీఎం వారికి స్పష్టంచేశారు. తప్పక న్యాయం జరుగుతుందని వారికి భరోసానిచ్చారు. అంతేకాక కుటుంబాన్ని ఆదుకుంటామని, వారికి అండగా నిలుస్తామని సీఎం వారికి స్పష్టంచేశారు. ఈవిషయమై మరోసారి కూలంకషంగా మాట్లాడుతానని, తన వద్దకు రావాలని వారికి సూచించారు. ప్రీతి కుటుంబాన్ని తన వద్దకు మరోసారి తీసుకురావాలంటూ అక్కడే ఉన్న తన కార్యాలయ అధికారులను సీఎం ఆదేశించారు.

First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు