హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆదివారం సెలవు లేదు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి.. ఈ బ్యాంకులు కూడా..!

ఆదివారం సెలవు లేదు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి.. ఈ బ్యాంకులు కూడా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం సెలవు దినము అయినప్పటికీ ప్రతి రోజు మాదిరిగానే కార్యాలయ పనివేళలైన ఉదయం 10.30గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరచిఉంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

రిపోర్టర్: ఆనంద్ మోహన్

లొకేషన్: విశాఖపట్టణం

విశాఖపట్టణంతో పాటు పలు జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదివారం సెలవు కాదు. ఆదివారం కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సాధారణ పనివేళల్లో రిజిస్ర్టేషన్లు చేయించుకోవచ్చు. ఇక రిజిస్ట్రేషన్ల ద్వారా వీలైనంత ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 26న కూడా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశించింది.

మీరెప్పుడైనా కటోరా తాగారా?..ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!

అటుస్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కూడా సహకరిస్తుందని, ప్రతి జిల్లాలో రెండు బ్రాంచీలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ప్రకటించారు. ఇటీవల బ్యాంకులకు ఎక్కువ సెలవులు రావడంతో ఆయా రోజుల్లో రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారు చలానాలు తీసుకోలేకపోయారు. దాంతో కొంత ఆదాయం తగ్గింది. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ ఆదివారం బ్యాంకులు తెరిచి సహకరించాలని ఐజీ కోరడంతో ఎస్‌బీఐ అధికారులు అంగీకరించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లాలో మెయిన్‌ బ్రాంచితో పాటు గోపాలపట్నం శాఖ ఆదివారం పనిచేస్తాయి. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి బ్రాంచీలు తెరుస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ కోరారు.

ఇటీవల ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి భూముల విలువ పెంచుతుందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఏటా ఆగస్టులో మాత్రమే విలువలు సవరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అధిక ఆదాయం కోసం కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచే విలువలు పెంచుతామని లీకులు ఇస్తోంది. ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవలసిన వారు ఫీజులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో మార్చిలోనే ఆయా కార్యక్రమాలు పూర్తిచేసుకుంటారని, తద్వారా ఆదాయం పెరుగుతుందని ఇలా ఫీలర్లు వదులుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది మార్చి నెలలోను ఇలాగే ప్రచారం చేశారు. కానీ ఆగస్టులోనే విలువలు సవరించారు. ఈసారి కూడా నెల రోజుల ముందుగానే భూ విలువల సవరణకు యత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం చేశారు. కానీ జిల్లా అధికారులకు వాటిపై ఎటువంటి సమాచారం రాలేదు. కాబట్టి ఏప్రిల్‌ నుంచి విలువ పెంపు ఏమీ ఉండదని జిల్లా అధికారి ఒకరు స్పష్టంచేశారు.

అటు శ్రీకాకుళం జిల్లాలోనూ జిల్లా ప్రధాన కేంద్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదివారం పనిచేయనున్నట్లు రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ కమీషనర్ & ఇన్ స్పెక్టర్ జనరల్ ఒక సర్క్యులర్ జారీచేశారు. ఆదివారం సెలవు దినము అయినప్పటికీ ప్రతి రోజు మాదిరిగానే కార్యాలయ పనివేళలైన ఉదయం 10.30గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరచిఉంటాయని చెప్పారు. వీటితో పాటు జిల్లా ప్రధాన కేంద్రంలో గలస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మెయిన్ బ్రాంచ్ తో పాటు రాజాం ఎస్.బి.ఐ శాఖ కూడా ప్రజల సొమ్ము చెల్లింపుల ఆమోదం కోసం తెరిచి ఉంటాయని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, అధికారులందరూ తమ కార్యాలయాలను తెరిచి ఉంచాలని ఆయన సర్క్యూలర్ ద్వారా ఆదేశించారు. కార్యాలయాలు తెరచి ఉంచుతున్నట్లు కార్యాలయాల నోటీసు బోర్డుల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

First published:

Tags: Local News, Visakhapatnam

ఉత్తమ కథలు